Begin typing your search above and press return to search.

అల్లు కపుల్స్.. స్పెషల్ ఫారెస్ట్ పిక్

By:  Tupaki Desk   |   14 July 2022 1:17 PM GMT
అల్లు కపుల్స్.. స్పెషల్ ఫారెస్ట్ పిక్
X
తెలుగు చిత్ర పరిశ్రమలలో బెస్ట్ ఫ్యామిలీ మెన్ గా క్రేజ్ అందుకున్న హీరోలలో అల్లు అర్జున్ కూడా టాప్ లిస్టులో ఉంటాడు అని చెప్పవచ్చు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా కుటుంబంతో కూడా రెగ్యులర్ గా టచ్ లో ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. అవసరమైతే కొన్నిసార్లు అల్లు అర్జున్ తన పిల్లలను షూటింగ్ స్పాట్ లోకి కూడా తీసుకువస్తూ ఉంటాడు. ఎక్కువగా వారితో గ్యాప్ రాకుండా చూసుకుంటూ ఉంటాడు.

అయితే ఈ క్రమంలో పుష్ప సినిమాతో ఇంకాస్త ఎక్కువగా బిజీగా ఉండడం వలన ఎక్కడికి వెళ్లడానికి కుదరలేదు. ఇక చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్ళాడు.

రీసెంట్ గా కొన్ని దేశాలను చుట్టేసిన అల్లు అర్జున్ ఎక్కువగా అయితే ఆఫ్రికా అడవుల్లోనే తన పిల్లలతో కలిసి ఎంజాయ్ చేసినట్లుగా తెలుస్తోంది. వైల్డ్ లైఫ్ కు ప్రసిద్ధి చెందిన టాంజానియా లో అల్లు అర్జున్ గత కొన్ని రోజులుగా తన పిల్లలతో అలాగే భార్య స్నేహరెడ్డితో కలిసి చలాకీగా ఎంజాయ్ చేశాడు.

ఇక ఇప్పుడు ట్రిప్ ముగియడంతో ఇండియాకు తిరిగి పయనమయ్యారు. ఇక సోషల్ మీడియాలో అల్లు అర్జున్ భార్య స్నేహలత ప్రత్యేకంగా ఒక ఫోటోను కూడా షేర్ చేసుకుంది. బన్నీతో టాంజానియా అడవుల్లో దిగిన ఒక ఫోటోను ఆమె షేర్ చేసుకుంది. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతొంది.

త్వరలోనే అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాకు సంబంధించిన సెకండ్ పార్ట్ షూటింగ్ ను మొదలు పెట్టబోతున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా కోసం బన్నీ ఇంకా పుష్ప లుక్కుతోనే కనిపిస్తున్నాడు.

అదే జుట్టుతో మళ్లీ ఎప్పటిలానే బన్నీ మరో ఏడాది పాటు తీవ్రస్థాయిలో ఇబ్బంది కూడా ఎదుర్కోబోతున్నాడు. ఇక పుష్ప సెకండ్ పార్ట్ ను వచ్చే ఎడాది విడుదల చేయాలి అని దర్శకుడు సుకుమార్ ప్రణాళికలు రచిస్తున్నాడు.