Begin typing your search above and press return to search.

బన్నీ మళ్లీ మార్చేస్తున్నాడు

By:  Tupaki Desk   |   19 July 2016 11:56 AM IST
బన్నీ మళ్లీ మార్చేస్తున్నాడు
X
ఒకే రకమైన క్యారెక్టర్లు.. ఒకే రకమైన లుక్ తో కనిపిస్తే ఈ రోజుల్లో కష్టం. కథలు మారుతున్నాయి. క్యారెక్టర్లు మారుతున్నాయి. లుక్స్ కూడా మార్చాల్సిందే. అల్లు అర్జున్ గత మూణ్నలుగు సినిమాల్లో ఒక్కోదాంట్లో ఒక్కో రకంగా కనిపించాడు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో కి.. ‘రుద్రమదేవి’కి.. ‘సరైనోడు’కు.. ఒకదాంతో ఒకదానికి పోలిక ఉండదు. ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోయే కొత్త సినిమాలో కూడా లుక్ మార్చేస్తున్నాడట బన్నీ. ‘సరైనోడు’ విడుదలనప్పటి నుంచి బన్నీ గడ్డం పెంచుతున్న సంగతి తెలిసిందే. ‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డి పాత్ర కోసం పెంచినప్పటి కంటే ఇప్పుడు ఎక్కువ గడ్డంతో కనిపిస్తున్నాడు.

బహుశా తన కొత్త సినిమాలో బన్నీ గడ్డంతోనే కనిపించవచ్చని అంటున్నారు. ‘రుద్రమదేవి’లో బన్నీ చేసింది ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కాదు. హరీష్ దర్శకత్వంలో పూర్తిగా సినిమా అంతా గడ్డంతో కనిపించే అవకాశముంది. ఈ గడ్డంతో ప్రయోగాలు చేసి.. స్టైలింగ్ తర్వాత ఓ లుక్ ఫైనలైజ్ చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా కోసం ప్రి ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయట. స్క్రిప్టు ఆల్రెడీ ఫైనల్ స్టేజ్ కు వచ్చేసినట్లు సమాచారం. సెప్టెంబర్లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుంది. ఇంకా హీరోయిన్ సంగతి తేలాల్సి ఉంది. ఇంతకుముందు బన్నీతో ఆర్య.. పరుగు సినిమాలు తీసిన దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్న సంగతి తెలిసిందే.