Begin typing your search above and press return to search.
స్నేహాతో పెళ్లికి ముందు శృతిని ప్రేమించిన అల్లు అర్జున్!?
By: Tupaki Desk | 30 May 2023 4:24 PMఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ముగింపు దశకు వచ్చింది. గత సీజన్ కు ఏమాత్రం తగ్గకుండా ఈ సీజన్ యొక్క ఫైనల్ ఎపిసోడ్ ను టీమ్ ప్లాన్ చేశారు. సీజన్ 2 యొక్క ఫైనల్ గెస్ట్ గా అల్లు అర్జున్ హాజరు అయ్యాడు. అల్లు అర్జున్ తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో పాల్గొని కంటెస్టెంట్స్ మరియు మెంటర్స్ తో సరదాగా మాట్లాడుతూ జోకులు వేశాడు. అదే సమయంలో పలు విషయాలను పంచుకున్నాడు.
తెలుగు ఇండియన్ ఐడల్ 2 కంటెస్టెంట్ శృతి పాట పాడిన తర్వాత అల్లు అర్జున్ మాట్లాడుతూ నీ పేరు అంటే నాకు చాలా ఇష్టం అంటూ నవ్వేశాడు. ఆ తర్వాత మాట్లాడుతూ నా మొదటి గర్ల్ ఫ్రెండ్ పేరు కూడా శృతి అందుకే నీ పేరు ఇష్టం అన్నట్లుగా బన్నీ వ్యాఖ్యలు చేశాడు.
అప్పుడు గీతా మాధురి స్పందిస్తూ గర్ల్ ఫ్రెండ్ అంటే ఒకటో తరగతిలోనా అంటూ కామెంట్ చేసింది. దాంతో అంతా నవ్వేశారు.
ఆ తర్వాత మరో కంటెస్టెంట్ పాట పాడిన తర్వాత అల్లు అర్జున్ మాట్లాడుతూ తన తండ్రి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
నాకు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. నాకు ఇన్ని ఇచ్చిన నాన్న నాకు దేవుడు. ఆయన్నే నేను గౌరవిస్తాను... అభిమానిస్తాను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.
ఇక ఈ షో లో తన సినిమాను ప్రమోట్ చేసేందుకు వచ్చిన సత్తిగాని రెండెకరాలు హీరో జగదీష్ తో కూడా అల్లు అర్జున్ సరదాగా మాట్లాడాడు. హీరో అయ్యాను కదా అని పుష్ప 2 షూటింగ్ కు రాకుండా ఉండోదు. నీ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. త్వరగా వచ్చేయి అంటూ బన్నీ సరదాగా జగదీష్ ను ఆట పట్టించాడు.