Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ బావ‌ల్ని సైడేసేంత క‌సితో!

By:  Tupaki Desk   |   9 March 2020 6:19 AM GMT
చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ బావ‌ల్ని సైడేసేంత క‌సితో!
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సంక్రాంతి విజేత‌గా నిలివ‌డ‌మే గాక‌ కెరీర్ ప‌రంగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అల వైకుంఠ‌పుర‌మ‌లో అత‌డికి గ్రేట్ కంబ్యాక్ అనే చెప్పాలి. నా పేరు సూర్య డిజాస్ట‌ర్ అయ్యాక‌ దాదాపు ఏడాదిన్న గ్యాప్ త‌ర్వాత వ‌చ్చిన స‌క్సెస్ ఇది. ఆ విజయాన్ని వ‌రుస పార్టీల‌తో ఏ స్థాయిలో ఎంజాయ్ చేసాడో చూసిందే. ఇప్పుడ రెట్టించిన‌ ఉత్సాహంతో సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా కోసం బ‌న్ని ప్రిపేర‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

క‌రోనా ప్ర‌భావం లేక‌పోతే ఈ సినిమా షెడ్యూల్ ఈపాటికే ప‌రిగెత్తేదే. విదేశీ షెడ్యూల్ ని సుక్కూ బృందం వాయిదా వేయ‌డం కొంత ఇబ్బంది పెట్టింది. ఇక ఈ గ్యాప్ లో బ‌న్ని త‌న పాత్ర‌కు సంబంధించిన ఆహార్యాన్ని ఇంప్రూవ్ చేశాడ‌ని టాక్. తాజా చిత్రం ఎర్రచంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో డిఫ‌రెంట్ స్టోరీ అని చిత్తూరు యాస హైలైట్ గా ఉంటుంద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. తెలుగు తెర‌పై ఇప్పటివ‌ర‌కూ ఏ ద‌ర్శ‌కుడు-హీరో ట‌చ్ చేయ‌ని పాయింట్ అన్న ప్ర‌చారం సాగుతోంది. బ‌న్ని ఇందులో లారీ డ్రైవ‌ర్ గా మాస్ రోల్ లో రఫ్ గ‌య్ గా క‌నిపించ‌నున్నాడు.

చ‌ర‌ణ్ కి `రంగ‌స్థ‌లం` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ని అందించిన సుకుమార్ .. బ‌న్నీకి కెరీర్ బెస్ట్ ఇవ్వాల‌ని ట్రై చేస్తున్నాడ‌ట‌. బ‌న్నీ స్క్రిప్ట్ డిమాండ్ మేర‌కు త‌న‌ను తాను మౌల్డ్ చేసుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. ఎంపిక చేసిన పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశానికి సిద్ద‌మ‌వుతున్నాడు. తెర‌పై స‌రికొత్త‌గా త‌న‌ని తాను ప్రేక్ష‌కాభిమానుల‌కు చూపించాల‌నుకుంటున్నాడు. దీనిలో భాగంగా చిత్తూరు మాండ‌లీకాన్ని బాగా నూరేస్తున్నాడ‌ట‌.

చిత్తూరు స్థానిక‌ యాస భాష‌ల‌పై ప్రత్యేకం గా దృష్టి సారించిన బన్ని ఓ కోచ్ ని నియ‌మించుకున్న సంగ‌తి తెలిసిందే. ఇల్లు..ఆఫీస్..ప‌ని గంట‌లు అనే హ‌ద్దులేవీ లేకుండా చిత్తూరు యాస‌ని న‌మిలేస్తున్నాడుట‌. ముఖ్యంగా ఆ యాస భాష‌ను యాజిటీజ్ గా దించేయాల‌ని రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మిస్తున్నాడుట‌. ప‌నిలో ప‌నిగా మెగా ప‌వ‌ర్ స్టార్ చ‌ర‌ణ్.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ల స్పీడ్ కు చెక్ పెట్టి... నంబ‌ర్ 1 స్థానాన్ని బ‌న్ని ఆక్ర‌మించాల‌ని చూస్తున్నాడ‌ట‌. స్క్రిప్టు ప‌రంగా.. మేక‌ర్ గా సుకుమార్ విష‌యంలో ఆలోచించాల్సిన ప‌నిలేదు. టాలీవుడ్ లోనే నెంబ‌ర్ టెక్నీషియ‌న్ గా ప్రూవ్ చేసుకున్నాడు. గ‌త సక్సెస్ లు ప్రూఫ్. రంగ‌స్థ‌లం అందుకు పెద్ద ఎగ్జాంపుల్. చ‌ర‌ణ్ మార్కెట్ ని రెట్టింపు చేసిన చిత్ర‌మిది.

బ‌న్నీకోసం రంగ‌స్థ‌లం త‌ర‌హాలో వైవిధ్య‌మైన స్క్రిప్టునే సుక్కూ ఎంపిక చేశాడ‌న్న టాక్ బ‌లంగా వినిపిస్తోంది. అందుకే బ‌న్ని చాలా క‌సిగా ఉన్నాడ‌ట‌. త‌న‌ పాత్ర ప‌రంగా ప‌ర్ పెక్ట్ అయితే చ‌ర‌ణ్ బావ‌ని.. ఎన్టీఆర్ బావ‌ని ప‌క్క‌కు నెట్టేయోచ్చ‌ని భావిస్తున్నాడుట‌. ఇప్ప‌టికే మ‌హేష్ తో పోటీ ప‌డి ఓ మెట్టు పైనే ఉన్నానని బ‌న్నీ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. మిగిలిన ఇద్ద‌ర్నీ కూడా సైడేస్తే లైన్ క్లియ‌ర్ అయిపోతుంద‌ని భావిస్తున్నాడుట‌. మ‌రి లైన్ క్లియ‌ర్ చేస్తాడా? మ‌ళ్లీ క‌న్ఫ్యూజన్ లో ప‌డ‌తాడా? అన్న‌ది కాలమే నిర్ణ‌యిస్తుంది.