Begin typing your search above and press return to search.

డిజె కొత్త లుక్ కేకలు పెట్టించేశాడుగా

By:  Tupaki Desk   |   1 Feb 2017 11:55 AM GMT
డిజె కొత్త లుక్ కేకలు పెట్టించేశాడుగా
X
మొన్నటివరకు కేవలం పాత లుక్కులో ఉన్న ఫోటోలే ఎప్పుడూ బయటకు రావడంతో.. అసలు ''డిజె దువ్వాడ జగన్నాథమ్'' సినిమాలో స్టయిలిష్‌ స్టార్ అల్లు అర్జున్ లుక్ ఎలా ఉండబోతోంది అనేదే పెద్ద పజిల్ అయిపోయింది. కాని అనుకోకుండా ఒక కొత్త ఫోటో ఒకటి బయటకు వచ్చేయడంతో.. ఆ ఫోటోను చూసి ఇప్పుడు బన్నీ లుక్కుపై మనం ఒక అంచనాకు వచ్చేయొచ్చు.

నిజానికి ఇప్పటివరకు అల్లు అర్జున్ ప్రతీసారి తన హెయిర్ స్టయిల్ తో కొత్త ప్రయోగాలు చేస్తూ ఇంప్రెస్ చేశాడు. అప్పట్లో ఆర్య 2 వంటి సినిమాల్లో హెయిర్ స్ర్టెయిటెనింగ్ చేసి.. లాంగ్ హెయిర్ తో ఇంప్రెస్ చేశాడు. తరువాత మొన్నీమధ్యన సరైనోడు సినిమాలో షార్ట్ ఫీల్డ్ కట్ తో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు డిజె సినిమాలో అయితే సింపుల్ షార్ట్ హెయిర్ తోనే.. పైగా స్ర్టయిటెనింగ్ చేసి.. స్పయిక్స్ తరహాలో ఉంచి.. తన అభిమానులను ఇంప్రెస్ చేయనున్నాడు బన్నీ. రోజు సెట్ కు వెళ్ళాక ఈ హెయిర్ స్టయిల్ క్రియేట్ చేయించడం.. అలాగే షూటింగ్ పూర్తయ్యాక వెంటనే హెయిర్ ను మళ్లీ మామూలుగా చేసేస్తున్నాడట. అందుకే ఫోటోలకు పెద్దగా చిక్కట్లేదు.

ఇకపోతే ఈ ఫోటోను చూసిన అభిమానులు మాత్రం.. బన్నీ కొత్త లుక్ కేకలు పెట్టించింది అంటున్నారు. మరి స్టయిలిష్‌ స్టార్ అని ఊరికే బిరుదులు ఇచ్చేస్తారేంటిలే. కాని ట్విస్ట్ ఏంటంటే.. ఈ ఫోటోను కొన్ని మీడియాల్లో ప్రచురించగా.. వెంటనే అల్లు వారి పి.ఆర్.ఓ గ్రూపు రంగంలోకి దిగి.. ఆ ఫోటోలను తీయించేశారు. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/