Begin typing your search above and press return to search.

బన్నీని గమనిస్తున్నారా బాబులూ..

By:  Tupaki Desk   |   25 Aug 2015 9:42 AM GMT
బన్నీని గమనిస్తున్నారా బాబులూ..
X
మొన్న చిరంజీవి 60వ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. అందులో మెగా ఫ్యామిలీ హీరోలందరూ సందడి చేశారు. వారిలో అల్లు అర్జున్ చాలా భిన్నంగా కనిపించాడు గమనించారా? ఎప్పుడూ మీసం ట్రిమ్ చేసి కనిపించే అల్లు అర్జున్.. తన కెరీర్లో తొలిసారి మీసం గట్టిగా గమనించాడు చూశారా? దీన్ని బట్టే బన్నీ మీద బోయపాటి ముద్ర పడిపోయిందని ఫిక్స్ అయిపోవచ్చు. సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ గత నెలే బోయపాటితో సినిమాను చడీచప్పుడు లేకుండా మొదలుపెట్టేశాడు. అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో శరవేగంగా సాగిపోతోంది.

మామూలుగా బోయపాటి సినిమాలంటేనే అదో రకం. హీరో పాత్ర చాలా గంభీరంగా, వీరత్వంతో కూడుకున్నదై ఉంటుంది. అంతకుముందు ఎలాంటి పాత్రలు పోషించినా.. ఎలా కనిపించినా.. తన చేతుల్లోకి రాగానే హీరోను మార్చేస్తాడు బోయపాటి. సింహా, లెజెండ్ సినిమాలతో బాలయ్యను ఎలా మార్చేశాడో అందరం చూశాం. ఇప్పుడు బన్నీ మీద కూడా ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్లున్నాడు. బన్నీతో మీసం పెంచిస్తున్నాడంటే సినిమాలో మీసం మెలేయించబోతున్నట్లే కనిపిస్తోంది. బన్నీ ఇప్పటిదాకా యాక్షన్ సినిమాలు చేసినా మరీ ఎక్కువ వయొలెంట్ గా కనిపించింది లేదు. మరి బోయపాటి సినిమా అంటేనే రక్తపాతానికి కేరాఫ్ అడ్రస్ లా ఉంటుంది. మరి బన్నీతో ఏ స్థాయిలో రక్తపాతం చేయిస్తాడో చూడాలి మరి.