Begin typing your search above and press return to search.

ఇంకో హోట‌ల్ పెట్టేసిన బ‌న్నీ!

By:  Tupaki Desk   |   18 Aug 2018 7:34 AM GMT
ఇంకో హోట‌ల్ పెట్టేసిన బ‌న్నీ!
X
సినీ న‌టులు వ్యాపారం చేయ‌టం కొత్తేం కాదు. సినిమాలు త‌క్కువ‌.. వ్యాపారాలు ఎక్కువ‌న్న‌ట్లుగా కొంద‌రు న‌టులు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న టాక్ వినిపిస్తోంది. సినిమాతో వ‌చ్చిన ఫేమ్ ను.. మ‌రిన్ని సినిమాలు తీయ‌టం ద్వారా ఇమేజ్ పెంచుకునే క‌న్నా.. త‌మ‌కున్న‌సినిమా ఇమేజ్ ను.. వ్యాపారాలు.. బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం ద్వారా ఇత‌ర రంగాల మీద ఫోక‌స్ పెంచుకుంటున్నార‌న్న విమ‌ర్శ ఉంది.

ఇదిలా ఉంటే.. ఇప్ప‌టికే త‌ను భాగ‌స్వామిగా హోట‌ల్ వ్యాపారంలో ఉన్న బ‌న్నీ.. తాజాగా మ‌రో బ్రాంచ్ ను ఓపెన్ చేశారు. గ‌చ్చిబౌలిలో తాను పార్ట‌న‌ర్ గా ఉన్న బి డ‌బ్స్ రెస్టారెంట్ బ్రాంచ్ ను ఓపెన్ చేశాడు. అంత‌ర్జాతీయంగా మంచి పేరున్న అమెరిక‌న్ రెస్టారెంట్ అయిన బి డ‌బ్స్ తో క‌లిసి తాను ఫ్రాంచైజ్ చేయ‌టంపై సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నాడు.

ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లో రెండు రెస్టారెంట్ల‌ను ఓపెన్ చేసిన వైనాన్ని చెప్పిన అల్లు అర్జున్.. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన మాట‌ను చెప్పాడు. దేశంలోని మ‌రిన్ని న‌గ‌రాల్లో ఈ రెస్టారెంట్ల‌ను ఓపెన్ చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు వెల్ల‌డించాడు. గ‌డిచిన ఎనిమిదేళ్ల‌లో ఏడాదికి ఒక‌టి చొప్పున మాత్ర‌మే సినిమా చేసే అల‌వాటున్న అల్లు అర్జున్ మాట‌లు వింటుంటే.. రానున్న రోజుల్లో సినిమాల కంటే బిజినెస్ ల మీద‌నే ఎక్కువ దృష్టి సారిస్తారా ఏంది? అలా అయితే.. ఫ్యాన్స్ ప‌రిస్థితేంటి బ‌న్నీ..?