Begin typing your search above and press return to search.

అవన్నీ సిల్లీ అంటున్న స్టైలిష్ స్టార్

By:  Tupaki Desk   |   1 May 2019 10:39 AM IST
అవన్నీ సిల్లీ అంటున్న స్టైలిష్ స్టార్
X
నా పేరు సూర్య తర్వాత ఏకంగా ఏడాది గ్యాప్ తీసుకుని ఇటీవలే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కొత్త మూవీ షూటింగ్ లో అడుగు పెట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇకపై స్పీడ్ పెంచబోతున్నాడు. పుట్టినరోజు సందర్భంగా ఒకేసారి మూడు ప్రాజెక్టులు అనౌన్స్ చేయడం ద్వారా ఇకపై తన దూకుడు ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పాడు.

ప్రస్తుతం వీలు దొరికినప్పుడంతా సోషల్ గా బయట కనిపించేందుకు ఇష్టపడుతున్న బన్నీకి గతంలో వచ్చిన ఓ ముఖ్యమైన పుకారుకు సంబంధించిన ప్రస్తావన వచ్చింది. కొంతకాలం క్రితం తండ్రి అల్లు అరవింద్ కు బన్నీకు మధ్య ఏవో విభేదాలు వచ్చాయని దాని కారణంగానే కొంత కాలం ఇద్దరు ఎడమొహం పెడమొహంలా ఉన్నారని ఇలా ఏదేదో ప్రచారం జరిగింది

దీని గురించి అడిగినప్పుడు బన్నీ స్పందిస్తూ ఇది చాలా ఆలస్యంగా తన దృష్టికి వచ్చిందని చెప్పాడు. చూడగానే నవ్వుకున్నానని రోజు కలిసి వృత్తితో పాటు ఎన్నో విషయాలు చర్చించుకునే తనకు నాన్నకు మధ్య ఇలాంటి గాసిప్స్ ఎలా సృష్టించారో అర్థం కాలేదని చెప్పుకొచ్చాడు. అంటే ఆన్ లైన్ వేదికగా జరిగే పుకార్ల పర్వం బన్నీ దృష్టిలో ఉందన్న మాట .కాకతాళీయంగా బన్నీ ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్న సినిమా కూడా ఫాదర్ సెంటిమెంట్ అని ఇప్పటికే టాక్ ఉంది. మొత్తానికి కాస్త లేట్ గా అయినా నాన్నకు తనకు ఉన్న గ్యాప్ పుకార్ల గురించి బన్నీ ఫైనల్ గా స్పందించాడు