Begin typing your search above and press return to search.
కొరటాల శివ - బన్నీ కాంబోలో సినిమా స్టార్ట్ అయ్యేది అప్పుడేనా...?
By: Tupaki Desk | 11 Jun 2020 2:40 PM ISTప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరు. సామాజిక అంశాలకు కమర్షియల్ హంగులను జోడించి ప్రేక్షకులకు ఏం కావాలో సమపాళ్లలో అందించే డైరెక్టర్ కొరటాల అని చెప్పవచ్చు. అందుకే ఈయన దర్శకత్వంలో సినిమా అంటే అది పక్కా హిట్ అనే భావనకు వచ్చేస్తారు ప్రేక్షకులు. ఇప్పటి వరకు కొరటాల తీసిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అందుకొని 100 పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్స్ లో ఒకడిగా ఉన్నారు. 'మున్నా' 'బృందావనం' 'బిందాస్' చిత్రాలతో రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కొరటాల శివ.. 'మిర్చి' సినిమాతో దర్శకుడిగా అవతారమెత్తాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకోవడంతో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఆ తర్వాత 'శ్రీమంతుడు' 'జనతా గ్యారేజ్' 'భరత్ అనే నేను' వంటి అద్భుతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. కాగా కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'ఆచార్య' అనే సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మాట్నీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిరు కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అటు మెగా అభిమానుల్లో ఇటు ఇండస్ట్రీ వర్గాలలో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో చిరు తనయుడు రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటించనున్నాడు. గత కొద్ది రోజులుగా శరవేగంగా జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్ కరోనా ప్రభావం వలన వాయిదా పడింది.
ఇదిలా ఉండగా 'ఆచార్య' సినిమా తర్వాత కొరటాల శివ ఏ హీరోతో సినిమా తీయబోతున్నాడో అనే ఆసక్తి అందరిలో ఉంది. అయితే గత కొన్ని రోజులుగా కొరటాల తదుపరి సినిమా అల్లు అర్జున్ తో చేయబోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొరటాల చెప్పిన స్టోరీ లైన్ బన్నీకి బాగా నచ్చిందని.. ప్రస్తుతం దొరికిన ఈ సమయంలో కొరటాల బన్నీని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ వర్క్ డెవలప్ చేసే పనిలో ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొరటాల తన స్టైల్ లోనే స్ట్రాంగ్ మెసేజ్ ఉండేలా స్టోరీ రెడీ చేస్తున్నాడట. తన కెరీర్లో బన్నీ సందేశాత్మక చిత్రాల్లో నటించింది తక్కువ అనే చెప్పాలి. 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' సినిమాతో ఆ ప్రయత్నం చేసినా అది డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ క్రమంలో కొరటాల - బన్నీ కాంబోలో వచ్చే సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుందో చూడాలి. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించనున్నారట. బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత బన్నీ పాన్ ఇండియా స్టార్ గా మారుతాడని భావిస్తున్న అల్లు అరవింద్ కొరటాల - బన్నీ కాంబోలో తెరకెక్కబోయే సినిమాని కూడా భారీ బడ్జెట్ తో నిర్మించాలని డిసైడ్ అయ్యారట. అల్లు అర్జున్ 'పుష్ప' మరియు వేణు శ్రీరామ్ 'ఐకాన్' సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందట. మరికొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.