Begin typing your search above and press return to search.

టాప్ 25 ప్ర‌తిభావంతులైన‌ భార‌తీయుల్లో అల్లు అర్జున్

By:  Tupaki Desk   |   13 Feb 2021 4:10 AM GMT
టాప్ 25 ప్ర‌తిభావంతులైన‌ భార‌తీయుల్లో అల్లు అర్జున్
X
ప్రతిష్టాత్మక జిక్యూ ఇండియా దేశంలోని వివిధ రంగాలలో అత్యంత ప్రభావవంతమైన 25 మంది యువ భారతీయుల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక‌రిగా నిలిచారు. లిస్ట్ లో పాపులర్ కమెడియన్ డానిష్ సైట్.. నటి అనుష్క శర్మ ఉన్నారు. క్రికెటర్లు కెఎల్ రాహుల్- రిషబ్ పంత్ కూడా జాబితాలో చోటు ద‌క్కించుకున్నారు.

`మార్పుకు దారితీసే వ్యక్తులు` అని ట్యాగ్ చేస్తూ GQ ప్ర‌శంసించింది. ఇన్నోవేటర్లు- ఎంటర్ టైనర్స్- డిస్ట్రప్టర్స్- గేమ్-ఛేంజర్స్ జాబితాలో వారి పేర్ల‌ను చేర్చింది. అల్లు అర్జున్ పేరు ఇందులో చోటు ద‌క్కించుకోవ‌డం త‌న ప్ర‌తిభ‌కు ద‌క్కిన‌ గౌరవంగా నిలిచింది. దక్షిణ భారత దేశంలో భాష‌తో ప‌ని లేకుండా స‌త్తా చాట‌గ‌లిగే అతి కొద్ది మంది స్టార్ల‌లో బ‌న్ని ఒకరని తేలింది.

సినిమాల‌తో బ‌న్ని పండించే వినోదం అంతా ఇంతా కాదు. భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన 25 మంది యువకులలో ఒకరిగా చేర‌డం బ‌న్ని లైఫ్ లో ఒక మైలురాయి అని చెప్పాలి. వృత్తిప‌ట్ల‌ అతని అంకితభావం.. గొప్ప‌ ఉత్సాహంతో సాధించిన గొప్ప‌ స్టార్ ‌డమ్ అత‌డికి ఈ కీర్తిని అందించింది. 2020 బ్లాక్ బ‌స్ట‌ర్ అల వైకుంఠ‌పుర‌ములో అత‌డి స్థాయిని మ‌రో లెవల్ కి చేర్చింది. ఈ సినిమా నుంచి పాట‌లు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల్ని అల‌రించాయి. రాములో రాములా.. బుట్ట బొమ్మా పాట‌లు చార్ట్ బ‌స్ట‌ర్ల‌లో నిల‌వ‌డ‌మే గాక‌.. ఈ రెండు పాటలు యూట్యూబ్ యొక్క 2020 టాప్ 10 మ్యూజిక్ వీడియోలలో చోటు దక్కించుకున్నాయి.

అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా హెడ్ ఆఫ్ ఒరిజినల్స్ అపర్ణ పురోహిత్ - థ్రైవ్ కో-ఫౌండర్ క్రిషిన్ సుబ్వానీ - హీరో సైకిల్స్ డైరెక్టర్ అభిషేక్ ముంజాల్- బైజు వ్యవస్థాపకుడు సీఈవో బైజు రవీంద్రన్ త‌దిత‌రులు ఈ జాబితాలో ఉన్నారు.