Begin typing your search above and press return to search.
ఇండియన్ 2 యాక్సిడెంట్ పై బన్నీ స్పందన
By: Tupaki Desk | 21 Feb 2020 5:45 AM GMTకమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్ 2 చిత్రం షూటింగ్ లో భారీ క్రేన్ కుప్పకూలి ముగ్గురు అక్కడికి అక్కడే మృతి చెందగా దర్శకుడు శంకర్ తో పాటు పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ సంఘటన ఇండియన్ సినీ పరిశ్రమనే కుదిపేసింది. సినీ ప్రేమికులు మరియు అన్ని భాషల సినీ ప్రముఖులు ఉలిక్కి పడేలా చేసింది. శంకర్ దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న దర్శకుడు అవ్వడం వల్ల ఈ యాక్సిడెంట్ గురించి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది.
తాజాగా అల్లు అర్జున్ ఈ యాక్సిడెంట్ గురించి స్పందించాడు. ట్విట్టర్ లో.. ఇప్పుడే యాక్సిడెంట్ గురించి తెలిసింది. చాలా భయంకరమైన సంఘటన. హృదయం ద్రవించి వేసింది. చనిపోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అన్నాడు. ఇంకా పలువురు టాలీవుడ్ స్టార్స్ కూడా ఈ యాక్సిడెంట్ గురించి స్పందించారు.
తెలుగు హీరోయిన్ కాజల్ అగర్వాల్ తృటిలో ప్రమాదం నుండి తప్పించుకుంది. మానిటర్ లో చూస్తున్న కాజల్ మరియు కమల్ హాసన్ లు కొన్ని సెకన్ల ముందు అక్కడ నుండి పక్కకు తప్పుకున్నారు. వారు అటు వెళ్లిన కొన్ని సెకన్లలోనే ఆ భారీ క్రేజ్ కుప్పకూలింది. కొన్ని సెకన్ల ముందు అయితే కమల్ మరియు కాజల్ లకు కూడా గాయాలయ్యేవి. ఈ భయంకర సంఘటన తల్చుకుంటేనే భయంతో ఒళ్లు అంతా కంపిస్తుందంటూ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది. ఇక ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు కమల్ కోటి సాయంను ప్రకటించాడు. లైకా ప్రొడక్షన్స్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.