Begin typing your search above and press return to search.
యంగ్ హీరో కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వస్తున్న అల్లు అర్జున్..?
By: Tupaki Desk | 26 Feb 2021 5:20 PM ISTఅల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ''చావు కబురు చల్లగా'' అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. యువ హీరో కార్తికేయ - లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాస్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో కొత్త దర్శకుడు పెగళ్ళపాటి కౌశిక్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే టీజర్ - సాంగ్స్ తో మేకర్స్ ఈ సినిమాపై ఆసక్తిని కలిగించారు. ఓ సీరియస్ పాయింట్ ని తీసుకుని వినోదాత్మకంగా ఈ సినిమాలో చెప్పినట్లు తెలుస్తోంది. మార్చి19న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు కార్తికేయ సినిమాకు సపోర్ట్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది.
'చావు కబురు చల్లగా' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడాని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమనికి చీఫ్ గెస్ట్ గా బన్నీ హాజరుకానున్నట్లు సమాచారం. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై రూపొందే సినిమా అనే కాకుండా హీరో కార్తికేయ కోసం అల్లు అర్జున్ ఈ ఈవెంట్ కి అటెండ్ అవుతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రంలో కార్తికేయ శవాలను తరలించే వాహనం డ్రైవర్ గా.. హీరోయిన్ లావణ్య త్రిపాఠి నర్స్ గా కనిపించనున్నారు. మురళీ శర్మ - ఆమని - శ్రీకాంత్ అయ్యంగర్ - మహేష్ - భద్రం తదితరులు ఇతర పాత్రలు పోషించారు. జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. కరమ్ చావ్లా సినిమాటోగ్రఫీ అందించగా.. సత్య ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.