Begin typing your search above and press return to search.

గత జన్మలో బన్నీ అలా చేశాడట

By:  Tupaki Desk   |   19 Jun 2017 4:03 AM GMT
గత జన్మలో బన్నీ అలా చేశాడట
X
పూర్వజన్మ.. పునర్జన్మ.. ఈ కాన్సెప్ట్ లను నిజ జీవితంలో ఎక్కువ మంది నమ్మబోం అని చెబుతుంటారు కానీ.. అంతర్లీనంగా చాలామందికి వీటిపై ఇంట్రెస్ట్ ఎక్కువగానే ఉంటుంది. సినిమాల్లో అయితే.. ఇదంతా నిజమే అని ఒప్పించేస్తుంటారు కూడా. ఇక జాతకాలు.. సెంటిమెంట్స్ గురించి ఫిలిం ఇండస్ట్రీలో ఉండే నమ్మకాలు చాలే ఎక్కువే.

స్టైలిష్ స్టార్ గా మెగాభిమానులు పిలుచుకుంటున్న అల్లు అర్జున్ గత జన్మ గురించి ఓ ఆస్ట్రాలజర్ ఇలాంటి విషయాలనే చెబుతున్నాడు. ఎస్వీ నాగనాథ్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఎక్కువే. అనేక టీవీ కార్యక్రమాల ద్వారా జాతకాలు చెప్పే ఈయన.. జాతకాలకు సైన్స్ కు కూడా మెలిపెట్టి మరీ విశ్లేషిస్తుంటాడు. తాజాగా ఓ మీడియా సమావేశంలో ఈయన బన్నీ పూర్వ జన్మ వృత్తాంతం గురించి వెల్లడించడం విశేషం. 'గత జన్మలో అల్లు అర్జున్ ఓ రైతు. ఉత్తర భారత దేశంలో ఉండేవాడు. తన భూమి దున్నుతున్న సమయంలో కొన్ని బంగారు నాణేలు లభించగా.. వాటిని పేద ప్రజలకు దానం చేసిన మహనీయమైన వ్యక్తి' అంటూ బన్నీని పొగిడేశాడు నాగనాథ్.

ఇదంతా ఈయనకు ఎలా తెలిసింది? అల్లు అర్జున్ ఈయన దగ్గరకు జాతకం చెప్పించుకునేందుకు వచ్చాడా? లాంటి సందేహాలు రావడం సహజమే కానీ.. సమాధానం లభించడమే కష్టమైన విషయం. ఎందుకంటే అవునని కానీ కాదనీ కానీ వీరిద్దరిలో ఎవరూ సమాధానం చెప్పే అవకాశం ఉండదు. ఆస్ట్రాలజీ.. న్యూమరాలజీ.. వాస్తు.. సెంటిమెంట్స్.. లాంటి వాటిని విపరీతంగా నమ్మే ఫిలిం ఇండస్ట్రీ జనాలు.. అల్లు అర్జున్ జాతకం చూపించుకోవడాన్ని పెద్ద విషయంగా పరిగణించకపోవచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/