Begin typing your search above and press return to search.

సరైనోడి సరైన ఇంటర్వెల్ బ్యాంగ్

By:  Tupaki Desk   |   3 Dec 2015 1:30 PM GMT
సరైనోడి సరైన ఇంటర్వెల్ బ్యాంగ్
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎంత చలాకీగా ఉంటాడో.. యాక్షన్ సీన్స్ లో అంత పవర్ నీ చూపిస్తాడు. దీనికి తోడు మనోడి అల్టిమేట్ ఫిట్ బాడీతో.. ఫైట్ సీన్స్ చేస్తుంటే.. ఆ ఎపిసోడ్ చూడాలే తప్ప చెప్పడానికి సాధ్యం కాదు. మరి ఇలాంటి గట్స్ ఉన్న హీరోకి.. మాస్ ని కిర్రెక్కించే మూవీస్ తీసే బోయపాటి శ్రీను తోడైతే ఎలా ఉంటుంది ?

అదే చూపిస్తున్నారు సరైనోడు సినిమాలో. ప్రస్తుతం హైద్రాబాద్ పరిసరాల్లో బన్నీ సినిమాకి సంబంధించిన ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్నారు. దాదాపు వెయ్యి మంది ఫైటర్లతో తీస్తున్న ఈ ఎపిసోడ్ ఇంటర్వెల్ కి ముందు వచ్చేదిగా తెలుస్తోంది. అల్లు వారబ్బాయి కెరీర్లోనే అత్యంత భారీగా ఖర్చు పెట్టిన ఇంటర్వెల్ బ్యాంగ్ ఇదే అంటున్నారు. ఈ సీక్వెన్స్ లో బన్నీతోపాటు లీడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ - సెకండ్ హీరోయిన్ కేథరిన్ థెరిసా - సీనియర్ హీరో శ్రీకాంత్ కూడా పాల్గొంటున్నారు. మూవీకి చాలా కీలకమైన ఈ ఫైట్ ని.. బోయపాటి చాలా ప్రెస్టీజియస్ గా తన స్టైల్ లో తెరకెక్కిస్తున్నాడని టాక్‌.

అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. సరైనోడిని 2016 సమ్మర్ కి షెడ్యూల్ చేశారు. ఈ మూవీలో ఇప్పటివరకూ కనిపించనంత మాస్ అవతారంలో బన్నీ కనిపించబోతున్నాడు. అంతే కాదు.. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం.. బన్నీ ఈ మూవీలో పోలీస్ కేరక్టర్ చేయబోతున్నాడట.