Begin typing your search above and press return to search.

మెగా హీరోలపై బన్నీ పైచేయి సాధించాడా..?

By:  Tupaki Desk   |   11 May 2022 4:30 AM GMT
మెగా హీరోలపై బన్నీ పైచేయి సాధించాడా..?
X
గత కొంతకాలంగా మెగా హీరోలు నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోతున్నాయి. ఏడాది ప్రారంభంలో పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన 'భీమ్లా నాయక్' సినిమా హిట్ టాక్ తో కూడా భారీ వసూళ్లు రాబట్టలేకపోయింది. వరుణ్ తేజ్ 'గని' మూవీ డిజాస్టర్ అయింది.

ఇదే క్రమంలో మెగా తండ్రీకొడుకులు చిరంజీవి - రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆచార్య' సినిమా టాలీవుడ్ లో అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా మిగిలింది. దీంతో నిరాశ చెందిన మెగా అభిమానులు.. ఇప్పుడు చిరు - పవన్ లైనప్ లో ఉన్న ప్రాజెక్ట్స్ ఆసక్తికరంగా లేవని నిరుత్సాహానికి గురవుతున్నారని టాక్ వినిపిస్తోంది.

చిరంజీవి ప్రస్తుతం 'గాడ్‌ ఫాదర్' 'భోళా శంకర్' వంటి రెండు రీమేక్‌ చిత్రాలతో పాటుగా బాబీ దర్శకత్వంలో Mega154 సినిమాలో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేతిలో 'హరి హర వీర మల్లు' 'భవదీయుడు భగత్ సింగ్' మరియ తమిళ చిత్రం 'వినోదయ సీతమ్' రీమేక్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

ఇప్పుడు అందరూ పాన్ ఇండియా రికార్డ్స్ గురించి మాట్లాడుకుంటున్న తరుణంలో.. మెగా దిగ్గజాలు లైన్ లో పెట్టిన సినిమాలేవీ ఫ్యాన్స్ ను అంతగా ఎగ్జైటింగ్ చేయడం లేదని అంటున్నారు. అయితే వారితో పోల్చుకుంటే రామ్ చరణ్‌ కి మంచి లైన్ అప్ ఉందని భావిస్తున్నారు.

రాజమౌళి RRR తర్వాత ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో RC15 చిత్రంలో నటిస్తున్నారు చరణ్. ఇది పాన్ ఇండియా మూవీ. అయినప్పటికీ చెర్రీ కంటే అల్లు అర్జున్ లైనప్ లో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ఉందని యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

'పుష్ప: ది రైజ్' సినిమాతో నార్త్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన బన్నీ.. జక్కన్న సహాయం లేకుండానే సరికొత్త పాన్ ఇండియా స్టార్ గా అవతరించారు. నేషనల్ వైడ్ ఈ మూవీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. దీంతో ఇప్పుడు 'పుష్ప 2' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సహజంగానే ఇది సీక్వెల్ ప్రయోజనాన్ని ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం ఉంది.

'పుష్ప: ది రూల్' సినిమాపై ఉన్న అంచనాల దృష్ట్యా.. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలుస్తుంది. అయితే 'ఆర్.ఆర్.ఆర్' వంటి బ్లాక్ బస్టర్ తో వచ్చిన క్రేజ్ తోనూ రామ్ చరణ్ 'ఆచార్య' సినిమాకు కనీస ఓపెనింగ్స్ తీసుకురాలేకపోయారు.

ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీలో చరణ్ కంటే అల్లు ఫ్యామిలీ నుంచి ఎదుగుతున్న బన్నీ కాస్త ముందున్నాడనే కామెంట్స్ వస్తున్నాయి. ఒకవేళ RC15 సినిమా హిట్టయితే.. రామ్ చరణ్ మళ్లీ పాన్ ఇండియా ట్రాక్ లోకి వచ్చే అవకాశం ఉంది. దీని తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చెర్రీ ఓ భారీ సినిమా చేయనున్నాడు.