Begin typing your search above and press return to search.

అందుకే వరుణ్ అంటే నాకు అంత ఇష్టం: బన్నీ

By:  Tupaki Desk   |   3 April 2022 3:50 AM GMT
అందుకే వరుణ్ అంటే నాకు అంత ఇష్టం: బన్నీ
X
వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన 'గని' సినిమా ఈ నెల 8వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లో నిర్వహించారు. ఈ వేదికపై అల్లు అర్జున్ మాట్లాడుతూ .. " అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా లైఫ్ లో వైజాగ్ చాలా స్పెషల్ సిటీ. నా ఫస్టు సినిమా నుంచి ఇప్పటి వరకూ ఇక్కడ షూట్ చేస్తూనే వస్తున్నాను. 'గని' సినిమాకి మా అన్నయ్య నిర్మాత. తెర వెనుక తాను చాలా కాలంగా చాలా సినిమాలకి పనిచేశాడు. కానీ తాను మా ఫాదర్ లా ఒక నిర్మాత అయితే బాగుండేది అనిపించేది.

ఈ సినిమాతో ఆ కోరిక నెరవేరింది. మా ఫాదర్ తో పాటు తన సపోర్టు కూడా నాకు ఉంటుంది. నేను ఎంచుకునే కథల్లో .. నేను చేసే సినిమాల్లో తను చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాడు. తనకి ఇది ఫస్టు సినిమానే కావొచ్చు .. కానీ తనకి 20 ఏళ్ల అనుభవం ఉంది. తాను ఒక కథను ఓకే చేశాడంటే అది మినిమమ్ బాగుంటుందని చెప్పచ్చు. సిద్ధూకి సినిమాలంటే ఇష్టం. అందుకోసం యూఎస్ లో జాబ్ మానుకుని ఈ వైపుకు వచ్చాడు. ఇద్దరూ కూడా నిర్మాతలుగా సక్సెస్ అవుతారనే నమ్మకం నాకు ఉంది.

నాకు వరుణ్ అంటే చాలా ఇష్టం .. చిన్నప్పటి నుంచి అందగాడు. వరుణ్ తేజ్ ఎంచుకునే కథలను చూసి నేను గర్వపడుతూ ఉంటాను. రెగ్యులర్ సినిమాలు కాకుండా ఏదో డిఫరెంట్ గా చేయాలి అనే తపనను తనలో చూశాను. ఆయన సినిమాలు హిట్ అయినా .. కాకపోయినా వాటిలో ఒక నాణ్యత ఉంటుంది. ఎప్పుడు చూసినా ఆయన పరిగెడుతూనే ఉంటాడు. వరుణ్ చాలా సేఫ్ గా ముందుకు వెళుతున్నాడు. ఇలాంటి సమయంలో కొత్త డైరెక్టర్ తో వెళ్లడమనేది రిస్క్. అందుకు తనని అభినందిస్తున్నాను.

వరుణ్ తేజ్ సినిమాలన్నీ ఒక ఎత్తు .. ఈ ఒక్క సినిమా ఒక ఎత్తు. ఈ సినిమా కోసం ఆయన మామూలుగా కష్టపడలేదు. ఆయన కసి .. హార్డ్ వర్క్ చూశాను గనుక ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాను నేను చూశాను .. నాకు నచ్చింది.

హీరోయిన్ సైయీ మంజ్రేకర్ చాలా క్యూట్ గా అనిపించింది. చాలామంది సీనియర్ ఆర్టిస్టులు ఈ సినిమాలో నటించారు. ఇక తమన్ ముట్టుకున్న ప్రతి సినిమా బంగారమవుతుంది. అది 'భీమ్లా' కావచ్చు .. 'అఖండ' కావచ్చు .. 'డీజే టిల్లు' కావచ్చు. ఆ జాబితాలో 'గని' కూడా చేరుతుందని భావిస్తున్నాను. కిరణ్ కొర్రపాటి ఫస్టు సినిమానే అయినా ఎంతో అనుభవం ఉన్నవాడిలా చేశాడు. ఇక ఫైనల్ గా ఒక మాట చెబుతున్నాను .. నా ఫ్యాన్స్ నా బలం .. నా ఫ్యాన్స్ నా ఇన్స్పిరేషన్" అని చెప్పుకొచ్చాడు.