Begin typing your search above and press return to search.

బన్నీ బర్త్ డే గిఫ్ట్ : ఐకాన్

By:  Tupaki Desk   |   8 April 2019 4:02 AM GMT
బన్నీ బర్త్ డే గిఫ్ట్ : ఐకాన్
X
ఇవాళ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఇప్పటికే సోషల్ మీడియాలో అభిమానులు ట్రెండింగ్ పేరుతో హంగామా చేస్తున్నారు. గంగోత్రి లాంటి హిట్ మూవీతో పరిచయమైనా బన్నీ కెరీర్ అనూహ్యమైన మలుపు తిరిగింది మాత్రం రెండో సినిమా ఆర్యతోనే. నమ్మశక్యం కానీ మేకోవర్ తో స్టైల్ కి నిర్వచనంలా యాక్టింగ్ లో మెచ్యూరిటీ పరంగా చూపించిన మార్పు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరమే పడలేదు.

కేరళలో ఏ హీరోకు సాధ్యం కానీ గొప్ప ఫాలోయింగ్ ని బన్నీ సంపాదించుకోవడం మరో అరుదైన ఘనతగా చెప్పుకోవచ్చు. ఇదిలా ఉండగా నా పేరు సూర్య తర్వాత ఏకంగా ఏడాది గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ఎట్టకేలకు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెడుతున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ది స్క్రిప్టింగ్ ఫైనల్ స్టేజి లో ఉండగా దాని తర్వాత మూవీ కోసం సుకుమార్ అప్పుడే వర్క్ మొదలుపెట్టేశాడు. ఇప్పుడు తన పుట్టిన రోజు సందర్భంగా బన్నీ మరో అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చేశాడు

దిల్ రాజు నిర్మాణంలో ఓ మై ఫ్రెండ్- ఎంసీ ఏ సినిమాలకు దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్ దర్శకుడిగా ఐకాన్ పేరుతో అదే బ్యానర్ లో మరో సినిమా రాబోతుంది. కనపడుట లేదు క్యాప్షన్ గా హై లైట్ చేశారు. లుక్ లాంటిది ఏమి లేకుండా కేవలం టైటిల్ లోగోని మాత్రమే కట్ చేసి ఆసక్తి రేపే ప్రయత్నం చేశారు. బైక్ మీద హీరో ఎక్కడికో వెళ్తున్నట్టు దూర సంచారానికి దేని కోసమో వెతికేందుకు వెళ్తున్నట్టు దాని థీమ్ రూపంలో చెప్పే ప్రయత్నం చేశారు.

మొత్తానికి ఇంత గ్యాప్ తర్వాత ఏకంగా మూడు సినిమాలతో అల్లు అర్జున్ అభిమానుల్లో జోష్ వచ్చేసింది. మురుగదాస్ తో కూడా ఉంటుంది అన్నారు కానీ ఎలాగూ ఈ మూడు పూర్తవ్వడానికి ఎంత లేదన్నా రెండేళ్లు పడుతుంది కాబట్టి ఆ లోపే దానికి సంబంధించిన క్లారిటీ రావొచ్చు. మొత్తానికి ఫాన్స్ కోసం సరైన గిఫ్ట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు