Begin typing your search above and press return to search.
'ఐకన్' కి లాయర్ సాబ్ బూస్ట్ ఇస్తాడా?
By: Tupaki Desk | 12 Feb 2020 2:00 PM ISTఒక్క ఐడియా జీవితాన్ని మార్చేసినట్టు ఒక్క బ్లాక్ బస్టర్ కెరీర్ జర్నీనే మార్చేస్తుంది! `నా పేరు సూర్య` డిజాస్టర్ అయ్యాక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డైలమా గురించి తెలిసిందే. `అల వైకుంఠపురములో` స్క్రిప్టు ఓకే చేసి రిలీజ్ చేయడానికి ఏడాదిన్నరకు పైగానే పట్టింది. త్రివిక్రమ్ అల స్క్రిప్ట్ లాక్ చేయకముందు ఎన్నో కథలు విని ఎందరో దర్శకులను పరిశీలించాడు. ఏవీ సంతృప్తినివ్వలేదు. అంటే ఒకే ఒక్క పరాజయం బన్నీని ఎంతగా ఇబ్బంది పెట్టిందో ఏడాదిన్నర డైలమా స్పష్టం చేసింది. ఈ జర్నీ బన్నీకి ఒక గొప్ప ఎక్స్ పీరియన్స్. ప్రతి నటుడికి ఇలాంటి ఫేజ్ సహజం. అయితే కొందరు నిర్ణయం వేగంగా తీసుకుంటారు.. ఇంకొందరు నెమ్మది గా అడుగులు వేస్తుంటారు. బన్ని ఎడా పెడా ఏదో ఒకటి చేసేయకుండా సావధానంగా ఆలోచించి అల స్క్రిప్టును ఓకే చేశాడు. ఏదైతేనేం చివరికి తన అంచనా నిజమైంది. 2020 సంక్రాంతి విజేత గా నిలిచాడు. అల వైకుంఠపురము లో సక్సెస్ తో ఇప్పుడు రెట్టించిన ఉత్సాహం లో ఉన్నాడు. అదే జోష్ లో సుకుమార్ దర్శకత్వం లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.
ఇక సుక్కూ కంటే ముందే వేణు శ్రీరామ్ దర్శకత్వం లో ఐకాన్ అనే సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏఏ 20 ఐకాన్ అంటూ వెల్లడించారు. కానీ ఆర్డర్ మారింది. సుక్కూ సడెన్ గా మధ్యలో దూరాడు. ఇక అప్పటికే తమిళ దర్శకుడు ఏ. ఆర్ మురగదాస్ - లైకా ప్రొడక్షన్ మూవీని కమిటయ్యాడు. ఇదంతా అల సినిమా సెట్స్ లో ఉండగానే జరిగిన తంతు. అయితే అనూహ్యంగా వేణు శ్రీరామ్ ఐకాన్ పక్కకు వెళ్లడంతో.. ఇప్పుడు `పింక్` రీమేక్ జాక్ పాట్ పట్టేశాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో లాయర్ సాబ్ ని తెరకెక్కిస్తున్నాడు. ఓ మై ఫ్రెండ్- ఎంసీఏ తర్వాత వెణూ శ్రీరామ్ తెకెక్కిస్తున్న 3వ చిత్రమది. తొలి రెండు సినిమాలు యావరేజ్ గానే ఆడాయి. అవి రొటీన్ కంటెంట్ తో తెరకెక్కించినవే అన్న విమర్శ ఉంది. ఇదే సమయం లో బన్నీకి ఐకాన్ సబ్జెక్ట్ నచ్చడంతో ఒకే చెప్పాడు. త్రివిక్రమ్- సుక్కూ తో ముందుకెళ్లడం తో ప్రస్తుతానికి ఇది హోల్డ్ లో ఉంది. పింక్ రీమేక్ లాయర్ సాబ్ సక్సెస్ పైనే `ఐకాన్` ప్రాజెక్ట్ ఉంటుందా ఉండదా? అన్నది ఆధారపడి ఉందన్న విశ్లేషణ తాజాగా తెరపైకి వచ్చింది. లాయర్ సాబ్ విజయం సాధిస్తేనే ఐకాన్ చేస్తారని లేదంటే బన్నీ వెనక్కి తగ్గే అవకాశం ఉందని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.
మరోవైపు మురగదాస్ తో బన్ని ప్రాజెక్ట్ గురించి ఇటీవల కథనాలు వస్తున్నాయి. అయితే మురుగదాస్ కి పాజిబిలిటీ ఎంత? అంటే.. అతడికి కొంత కాలంగా సరైన రిజల్ట్ లేదు. సంక్రాంతి బరిలో రిలీజైన `దర్బార్` బ్లాక్ బస్టర్ అంటూ ప్రచారం చేసినా.. తమిళ డిస్ట్రిబ్యూటర్లు నష్టాలు అంటూ రోడ్డెక్కి నానా రచ్చ చేయడం చర్చకు వచ్చింది. మురుగాస్ అంతకు ముందు తెరకెక్కించిన సర్కార్ కోలీవుడ్ వరకే హిట్టయ్యి.. తెలుగు ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. ఇంకాస్త వెనక్కి వెళితే మహేష్ తో స్పైడర్ ఎలాంటి ఫలితాలు సాధించిందో తెలిసిందే. ఈ నేపథ్యం లో వేణు శ్రీరామ్.. మురగదాస్ లతో బన్ని కమిట్ మెంట్లు సేఫ్ జోన్ లో లేనట్టేనన్న విశ్లేషణ సాగుతోంది. ఆ ఇద్దరి మధ్యలోకి ఇప్పుడు త్రివిక్రమ్ దూరే వీలుంది. అల బ్లాక్ బస్టర్ నేపథ్యం లో ఈ సినిమాకి సీక్వెల్ ని ప్లాన్ చేస్తుండడం ఇతర దర్శకులకు ఇబ్బందికరమే.