Begin typing your search above and press return to search.

బ‌న్ని ఆతిధ్యం.. 40 మంది స్టార్ల‌తో మీటింగ్‌!

By:  Tupaki Desk   |   10 Nov 2015 5:05 AM GMT
బ‌న్ని ఆతిధ్యం.. 40 మంది స్టార్ల‌తో మీటింగ్‌!
X
టాలీవుడ్‌ లో ఆర్టిస్టుల సంఘం... మా అసోసియేష‌న్ చాలా యాక్టివ్‌ గానే ఉంది. అయితే ఇందులో బోలెడ‌న్ని రాజ‌కీయాలుంటాయి. అస‌లు స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావు. అందుకే ఇప్పుడు మా అసోసియేష‌న్‌ కి ఓ ప్ర‌త్యామ్నాయం ఏర్పాటు చేసే ప‌నిలో కొంద‌రు స్టార్లు ఉన్నార‌ని చెప్పుకుంటున్నారు. ఇప్పుడున్న హీరోలు, హీరోయిన్‌లు అంద‌రూ ఓ టీమ్‌గా ఏర్ప‌డి భ‌విష్య‌త్ సినిమాని న‌డిపించాల‌న్న‌ది ప్లాన్‌ లో భాగం. సినిమాల రిలీజ్‌ లు, సినిమాల బ‌డ్జెట్‌ లు త‌దిత‌ర విష‌యాల్ని పూర్తిగా త‌మ కంట్రోల్‌ లో ఉంచుకోవాల‌న్న‌ది అస‌లు ఉద్ధేశం. ఆలోచ‌న మంచిదే. ఆచ‌ర‌ణ‌లోనూ దూకుడుగానే ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది ఈ టీమ్‌. ప్ర‌తి ఆదివారం మీటింగులే మీటింగులు. మీటింగ్ కం పార్టీలు ఎరేంజ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే రెండు మీటింగులు పూర్త‌య్యాయి. మొద‌టి మీటింగ్‌ కి రానా స్వ‌యంగా ఆతిధ్యం ఇచ్చాడు.

ఇక రెండోసారి మీటింగుకి అల్లూ వార‌బ్బాయ్ బ‌న్ని హోస్ట్‌ గా వ్య‌వ‌హ‌రించారు. ఈసారి పార్టీలో దాదాపు 40 మంది వ‌ర‌కూ పాల్గొన్నారు. మీటింగులో యువ హీరోలంద‌రితో పాటు త‌మ‌న్నా - కాజ‌ల్‌ - ప్ర‌భాస్ వంటివాళ్లు పాల్గొన్నారు. వారం వారం ఇక రెగ్యుల‌ర్‌ గా ఈ మీటింగులు జ‌రుగుతుంటాయి. ఇందులో ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన కీల‌క విష‌యాల్ని చ‌ర్చిస్తున్నారు. పైగా స్టార్ల మ‌ధ్య మిస్ అండ‌ర్‌ స్టాండింగ్స్ ఏవైనా ఉంటే ఇక్క‌డ తొల‌గించుకునేందుకు ఆస్కారం ఉంది. బిజినెస్ ప‌రంగా ఒక‌రికొక‌రు పోటీ ప‌డ‌కుండా ప్లాన్డ్‌ గా ఎలా వెళ్లాలో చ‌ర్చించే ఛాన్స్ ఉందిక్క‌డ‌. అయితే మీటింగులో మాట్లాడుకునే ఏ విష‌యాల్ని స‌ద‌రు హీరో - హీరోయిన్‌ లు బైటికి చెప్ప‌కూడ‌దు అన్న‌ది మొద‌టి కండిష‌న్‌. అస‌లు ఏం మాట్లాడుకుంటున్నాం? పార్టీ ఎలా జ‌రిగింది? వ‌ంటి విష‌యాల్ని బైటికి చెప్ప‌కూడ‌దన్న‌ది స్ర్టిక్ట్ రూల్‌.