Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ టైం లో బన్నీ ఏమి చేస్తున్నాడు...?

By:  Tupaki Desk   |   5 May 2020 9:30 AM GMT
లాక్ డౌన్ టైం లో బన్నీ ఏమి చేస్తున్నాడు...?
X
అల్లు అర్జున్ ఈ ఏడాది ప్రారంభంలో 'అల వైకుంఠపురంలో' సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కాడు. ఇదే ఊపులో స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ తో 'పుష్ప' సినిమా పట్టాలెక్కించేసాడు. బన్నీ - సుక్కు కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇకపోతే లాక్ డౌన్ కారణంగా గత కొన్నిరోజులుగా ఇంటికే పరిమితమైన అల్లు అర్జున్ డైలీ ఎలా ఉంటున్నారనేది అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. ఎందుకంటే లాక్ డౌన్ విధించినప్పటి నుండి స్టార్ హీరోయిలందరూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లో ఉంటూ వస్తున్నారు. ఇంట్లో వారు ఎలా గడుపుతున్నారో తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో బన్నీ ఏమి చేస్తున్నాడో అని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన సోదరుడు అల్లు శిరీష్ ని ప్రశ్నించారు. ఆ సందర్భంగా అల్లు శిరీష్ లాక్ డౌన్ సమయాన్ని ఎలా స్పెండ్ చేస్తున్నాడో వివరించాడు.

అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో ఎలా ఉంటాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. షూటింగ్ కి ఏ మాత్రం గ్యాప్ వచ్చినా తన కుటుంబంతోనే ఏకాంతంగా గడుపుతుంటాడు. ఇక ఇప్పుడు లాక్ డౌన్ వల్ల రోజంతా.. బన్నీ తన పిల్లలోతోనే ఉంటున్నాడట. రోజుకో అల్లరి పని చేస్తూ పిల్లలతో సరదగా టైమ్ స్పెండ్ చేస్తున్నట్లు అల్లు శిరీష్ వివరణ ఇచ్చాడు. చాలా కాలం తరువాత ఎక్కువ గ్యాప్ దొరకడంతో అల్లు అర్జున్ తన పిల్లల్ని ఏ మాత్రం వదలడంలేదట. కూతురు అర్హ, కొడుకు అయాన్ కూడా ఓ మై గాడ్ డాడీ అంటూ.. రోజంతా ఎంజాయ్ చేస్తున్నారట. ఇక ఎప్పటికప్పుడు వారికి సంబంధించిన వీడియోలు - ఫొటోలు అల్లు అర్జున్ సతీమణి స్నేహాలత తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తోంది. రీసెంట్ గా అల్లు అర్హ బుట్ట బొమ్మ సాంగ్ ని పాడుతున్నట్లు యాక్ట్ చేయడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. కాగా అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాలో చిత్తూర్ యాసలో మాట్లాడతాడన్న విషయం తెలిసిందే. దీని కోసం బన్నీ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ లాక్ డౌన్ సమయంలో ఆ స్లాంగ్ మీద పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నాడని సమాచారం.