Begin typing your search above and press return to search.

బన్నీకి వీసా ఇచ్చి విషెస్‌ చెప్పారు

By:  Tupaki Desk   |   2 Jun 2016 2:02 PM GMT
బన్నీకి వీసా ఇచ్చి విషెస్‌ చెప్పారు
X
షూటింగుల నిమిత్తం చాలా దేశాలు చుట్టొచ్చే సినిమా హీరోలకు.. దాదాపు ఏ దేశపు వీసా అయినా ఇట్టే విచ్చేస్తారు. కాని మ్యాటర్‌ ఏంటంటే.. ఇక్కడ స్టయిలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ కు వీసా ఇవ్వగానే సదరు దేశపు కాన్సులేట్‌ జనరల్‌ వారు దానిని తమ ఫేస్‌ బుక్‌ పేజీలో అఫీషియల్‌ గా పోస్టు చేసుకున్నారు కూడా.

ఇవాళ ఉదయం టర్కీ కాన్సులేట్‌ జనరల్‌ ఆఫీసుకు వెళ్ళిన బన్నీకి.. వెంటనే వీసా ఇచ్చేశారు టర్కీ దేశం వారు. హైదరాబాదులోని తమ కార్యాలయంలో.. బన్నీకి వీసాను అందజేస్తూ ఒక ఫోటో కూడా తీసుకున్నారు. దానిని మళ్లీ తమ ఫేస్‌ బుక్‌ పేజీలో కూడా షేర్‌ చేసి.. తమ దేశం వెళుతున్న బన్నీకి విషెస్‌ కూడా తెలిపారు. ఇంతకీ అసలు బన్నీ టర్కీ ఎందుకు వెళుతున్నాడు? మొన్ననే కశ్మీర్‌ నుండి తిరిగొచ్చాడు. ఇప్పుడు టర్కీ ఫ్యామిలీ టూర్‌ వెళుతున్నాడా? లేకపోతే ఏదైనా సినిమా సిట్టింగులకు అక్కడకు వెళ్ళనున్నాడా?

ఇప్పటికే చాలా తెలుగు సినిమాల పాటలను సీన్లను టర్కీలో తీశారులే. ముఖ్యంగా మహేష్‌ దూకుడు సినిమాలో ఫస్టాఫ్‌ లో చాలా భాగం టర్కీలోనే ఉంటుంది.