Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ డ్యాన్సులకు ఫిదా అయిన 'లోఫర్' బ్యూటీ

By:  Tupaki Desk   |   1 April 2020 6:15 AM GMT
అల్లు అర్జున్ డ్యాన్సులకు ఫిదా అయిన లోఫర్ బ్యూటీ
X
అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా నటింటించిన 'అల వైకుంఠపురంలో' చిత్రంలోని 'బుట్ట బొమ్మ' సాంగ్ ఎంత హిట్ అయిందో అందరికి తెలిసిందే. థమన్ సంగీతం అందించిన ఈ సాంగ్ కి బాలీవుడ్ లో కూడా స్టెప్పులు వేశారు. అయితే తాజాగా ఈ సాంగ్ లోని ఒక బిట్ ని ఇంస్టాగ్రామ్ లోని తన స్టోరీలో పోస్ట్ చేసిన ఒక బాలీవుడ్ బ్యూటీ 'ఇది ఇతనికి ఎలా సాధ్యం' అంటూ కామెంట్ పెట్టింది. దీనికి బన్నీ కూడా స్వీట్ గా రిప్లై ఇచ్చాడు. వివరాల్లోకి వెళ్తే బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'లోఫర్' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ధోని బయోపిక్, భాగీ 2, మలంగ్‌ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు దిశా. తెలుగులో మళ్ళీ అవకాశాలు అందిపుచ్చుకోని ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా ఇక్కడి వాళ్లకు కూడా బాగా టచ్ లో ఉంటుంది. సోషల్ మీడియాలో ఈమె పెట్టే పోస్టుల కోసం కుర్రకారు వెయిట్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ హాట్ బ్యూటీ తన ఇంస్టాగ్రామ్ స్టోరీగా పెట్టిన పోస్టు ఇప్పుడు మన తెలుగు ఆడియన్స్ అందరు ఆమె గురించి మాట్లాడుకునేలా చేసింది. బన్నీ డ్యాన్స్ లను మెచ్చుకుంటూ ఆ అమ్మడు పెట్టిన పోస్టుకు 'నేను మ్యూజిక్ ని ఇష్టపడతాను, మంచి మ్యూజిక్ నన్ను డాన్స్ చేసేలా చేస్తుంది, థ్యాంక్స్ ఫర్ కాంప్లిమెంట్' అంటూ బన్నీ రిప్లై ఇచ్చాడు. వీరిద్దరి మధ్య సంభాషణ చూస్తుంటే ఫ్యూచర్ లో కలిసి నటిస్తారేమో అని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. దిశా పటాని ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌ సరసన ‘రాధే’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.