Begin typing your search above and press return to search.

ఒక్క షాట్‌ కోసం బ‌న్నీ ఇంత‌లా క‌ష్ట‌ప‌డ్డాడా?

By:  Tupaki Desk   |   10 Jan 2022 6:00 PM IST
ఒక్క షాట్‌ కోసం బ‌న్నీ ఇంత‌లా క‌ష్ట‌ప‌డ్డాడా?
X
అనుకున్న‌ది పొందాలంటే అందు కోసం క‌ఠోరంగా శ్ర‌మించాల్సిందే. స్టార్ హీరో స్టేట‌స్ ఏర్ప‌డినా.. క్రేజీ స్టార్ గా పేరు తెచ్చుకున్నా ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో స్టార్ హీరోల‌కు ప్ర‌తి సినిమా మొద‌టి సినిమాలానే అవుతోంది. మొద‌టి సినిమా అనుకునే శ్ర‌మించాల్సి వ‌స్తోంది. స్టార్ డ‌మ్ ని సొంతం చేసుకున్న వారు కూడా ఇక మ‌నం రిలాక్స్ అయిపోదాం.. మ‌న‌కు న‌చ్చిందే చేద్దాం అనుకోవ‌డం లేదు. త‌మ‌ని అభిమానించే వారి కోసం ఎంత క‌ష్ట‌మైనా వెనుకాడ‌టం లేదు.

ఐకాన్ స్టార్ బ‌న్నీ కూడా ఈ స్థాయిలో శ్ర‌మించ‌డం, ఒక్క సీన్ కోసం 12 గంట‌ల‌పాటు క‌ష్ట‌ప‌డ‌టం ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన తాజా చిత్రం `పుష్ప : ది రైజ్‌`. సుకుమార్ తెర‌కెక్కించిన ఈ మూవీ ఇటీవ‌ల విడుద‌లై పాన్ ఇండియా స్థాయిలో సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే. ద‌క్షిణాదితో పాటు ఉత్త‌రాదిలోనూ ఈ మూవీ రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌డుతోంది.

బ‌న్నీ కెరీర్ లోనే అత్య‌ధిక వసూళ్ల‌ని రాబ‌ట్టిన మూవీగా రికార్డులు సృష్టిస్తోంది. ఇందుకు హిందీ వెర్ష‌న్ సాధిస్తున్న వ‌సూళ్లే నిద‌ర్శ‌నం. 70 కోట్ల మార్కుని దాటి రికార్డు దిశ‌గా ఈ మూవీ ప‌య‌నిస్తోంది. బ‌న్నీ పుష్ప‌రాజ్ గా ప‌క్కా మాస్ పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రంపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు కురుస్తున్న విష‌యం తెలిసిందే. బాలీవుడ్ హీరో, హీరోయిన్ లు, క్రిటిక్స్ బ‌న్నీని పొగ‌డ్త‌ల్లో ముంచెత్తుతున్నారు.

ఇదిలా వుంటే ఈ మూవీ కోసం బ‌న్నీ క‌ఠోరంగా శ్ర‌మించార‌ని తెలుస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వార్త ఆస‌క్తిని, ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. మేక‌ర్స్ `హే బిడ్డా.. ఇది నా అడ్డా.. ` పాట కోసం బ‌న్నీ క‌ఠోరంగా శ్ర‌మించారని సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. ఈ పాటలోని ఒక్క షాట్‌ కోసం బ‌న్నీ 12 గంట‌లు క‌ష్ట‌ప‌డ్డార‌ట‌. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి అర్థరాత్రి 2 గంట‌ల వర‌కు అల్లు అర్జున్ శ్ర‌మించినట్టుగా స్ప‌ష్టం చేశారు. అంతే కాకుండా ఈ పాట కోసం మొత్తం 24 డ్రెస్ లు ఉప‌యోగించాడ‌ని తెలిపారు.

అంతే కాకుండా ఈ పాట‌లో వేరియేష‌న్స్ చూపించ‌డానికి బ‌న్నీ చాలా క‌ష్ట‌ప‌డ్డార‌ని, ఇంత‌గా శ్ర‌మించారు కాబ‌ట్టే ఆయ‌న ఐకాన్ స్టార్ అయ్యార‌న్నారు. ఈ సంద‌ర్భంగా `హే బిడ్డా.. ఇది నా అడ్డా.. `పాట‌కు సంబంధించిన స్టిల్స్ ని మేక‌ర్స్ అభిమానుల‌తో పంచుకున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట సంద‌డి చేస్తున్నాయి. ఈ పాట కోసం బ‌న్నీ ఇంత‌లా శ్ర‌మించాడ‌ని తెలియ‌డంతో ఆయ‌న ఫ్యాన్స్ ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.