Begin typing your search above and press return to search.

ఫిట్నెస్ పై ఫోకస్ చేస్తున్న అల్లు అర్జున్

By:  Tupaki Desk   |   21 March 2019 12:40 PM IST
ఫిట్నెస్ పై ఫోకస్ చేస్తున్న అల్లు అర్జున్
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా' తర్వాత సినిమాల నుండి పెద్ద బ్రేక్ తీసుకున్నాడు. దాదాపుగా పది నెలలపాటు షూటింగ్ లేకుండా ఉండడం ఇది తన కెరీర్లోనే మొదటిసారి. త్రివిక్రమ్ సినిమాను చాలా రోజుల క్రితమే లైన్లో పెట్టినా.. స్క్రిప్ట్ ను పకడ్బందీగా తీర్చిదిద్దడంలో సమయం పడుతోంది. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ చివరిదశకు చేరుకోవడంతో అల్లు అర్జున్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు.

సినిమాల నుండి గ్యాప్ రావడంతో అల్లుఅర్జున్ కు ఫుల్ గా ఫ్యామిలీతోనే ఉన్నాడు. ఇలా ఉంటే ఫిట్నెస్ పై శ్రద్ధ ఆటోమేటిక్ గా తగ్గుతుంది కదా. అందుకే కాస్త వెయిట్ కూడా పెరిగాడు. ఇప్పుడు మళ్ళీ సినిమా షూటింగ్ మొదలు కానుండడంతో తన ఫిట్నెస్ పై ఫోకస్ చేస్తున్నాడు. రెగ్యులర్ గా జిమ్ కు వెళ్తూ ఎక్సర్ సైజులు చేయడమే కాకుండా స్ట్రిక్ట్ గా డైట్ కూడా ఫాలో అవుతున్నాడట. ఈ సినిమాలో బన్నీ స్లిమ్ లుక్ లో కనపడతాడని సమాచారం.

బన్నీ మొదటినుండి ఫిట్నెస్ కు ఎంతో ప్రాముఖ్యతనిచ్చే హీరో. అంతెందుకు టాలీవుడ్ లో మొదటిసారి సిక్స్ ప్యాక్ చేసిన హీరో కూడా బన్నీనే. ఫిట్నెస్ మెయిన్టెయిన్ చెయ్యడమే కాకుండా ప్రతి సినిమాకు తన లుక్ మార్చుకునే బన్నీ ఈ సారి ఎలాంటి లుక్ లో కనిపిస్తాడో వేచి చూడాలి. త్వరలోనే బన్నీ కొత్త లుక్ బయటకు వచ్చే అవకాశం ఉంది.