Begin typing your search above and press return to search.
బన్నీకి ఎదురు చూపులు తప్పవు!
By: Tupaki Desk | 22 Nov 2018 12:08 PM ISTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య మేలో విడుదలై ఇప్పటికే ఆరు నెలలు దాటేసింది. అదేమైనా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యుంటే అభిమానులు పోనీలే అని కొత్త సినిమా కోసం ఎక్కువ రోజులు వెయిట్ చేసేవాళ్ళు. కానీ దాని ఫలితం తెలిసిందే. దాని దెబ్బకే బన్నీ కథల విషయంలో తొందపడకూడదు అని నిర్ణయం తీసుకుని ఎంత ఆలస్యం అవుతున్నా షూటింగ్ స్పాట్ కు వెళ్లే ఆలోచన చేయడం లేదు. విక్రమ్ కుమార్ స్క్రిప్ట్ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్లనో లేక ఇంకే కారణమైనా ఉందేమో తెలియదు కానీ ఫైనల్ గా బన్నీ కోసం త్రివిక్రమ్ లాకైపోయాడు.
రేపో ఎల్లుండో షూటింగ్ స్టార్ట్ అంటారేమో అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు ఇప్పట్లో ఉపశమనం కలిగేలా లేదు. కారణం స్క్రిప్ట్ రెడీ కాకపోవడమే అని ఇన్ సైడ్ టాక్. నిజానికి ఈ కాంబో అనుకున్నప్పుడు హిందీ బ్లాక్ బస్టర్ సోను కి టీటు కి స్వీటీని తెలుగుకు తగ్గట్టు అల్లు అర్జున్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని కీలక మార్పులు చేసి చేద్దాం అనుకున్నారు. కానీ రీమేక్ హక్కుల విషయంలో ఒరిజినల్ నిర్మాత టి సిరీస్ తో ఏర్పడిన చిక్కుముడి వల్ల ఎందుకొచ్చిన గొడవ అనుకుని ఏకంగా ఆ ఐడియాని డ్రాప్ అయిపోయారు.
దాంతో ఇలా కాదని స్ట్రెయిట్ కథతోనే ముందుకు వెళదామని త్రివిక్రమ్ చెప్పడంతో బన్నీ సరే అన్నట్టు వినికిడి. అయితే ఇదంతా పూర్తయ్యే లోపు ఎంత లేదన్నా ఫిబ్రవరి కావొచ్చు. ఆపై షూటింగ్ కు ఎంత లేదన్నా ఆరు నెలల సమయం కావాలి. సో ఏడాదిన్నర గ్యాప్ తప్పేలా లేదు. జులాయి తరహాలో యాక్షన్ ప్లస్ ఎంటర్ టైన్ మెంట్ రెండు సమతూకంగా ఉండేలా త్రివిక్రం కథను వండుతున్నట్టు సమాచారం.