Begin typing your search above and press return to search.

'మెగాస్టార్ అల్లు అర్జున్'...మ‌రి చిరు...?

By:  Tupaki Desk   |   3 July 2017 2:12 PM GMT
మెగాస్టార్ అల్లు అర్జున్...మ‌రి చిరు...?
X
గ‌తంలో 'చెప్పను బ్రదర్' అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్య‌ల‌కు మెగా అభిమానుల నుంచి వ్య‌తిరేక‌త ఎదురైన సంగ‌తి తెలిసిందే. ఆ గొడ‌వ స‌ద్దుమ‌ణిగిపోయింద‌నుకున్న త‌రుణంలో బ‌న్నీ మ‌రో వివాదంలో చిక్కుకున్నాడు. అయితే, తాజా వివాదంతో బ‌న్నీకి ఏ మాత్రం సంబంధం లేదు. ఈ సారి బ‌న్నీ పేరు ఆయ‌న‌కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది.

ప్ర‌ముఖ ఆన్ లైన్‌ టికెట్ బుకింగ్ వెబ్ సైట్ బుక్ మై షో త‌న ఫేస్ బుక్ పేజీలో మెగాస్టార్ అల్లు అర్జున్ ఈజ్ బ్యాక్ అని స్టేట‌స్ మెసేజ్ పెట్టింది. అవునా, మ‌రి చిరంజీవిని ఇన్నాళ్లూ మెగాస్టార్ అనుకున్నానే....అంటూ ఓ వ్య‌క్తి దీనిపై వ్యంగ్యంగా స్పందించాడు. ఈ పోస్ట్ పెట్టిన బుక్ మై షో పై మెగా అభిమానులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. హీరోలు ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే బిరుదులు తెలుసుకొని ఇటువంటి పోస్టులు పెట్టాల‌ని మండిప‌డుతున్నారు.

భ‌విష్య‌త్తులో కాబోయే మెగా స్టార్ రామ్ చ‌ర‌ణ్ అని మెగా అభిమానులు ఫిక్స‌య్యారు. ఆ బిరుదును మెగా ఫ్యామిలీలో మ‌రే హీరోకు ఆపాదించ‌డానికి ఫ్యాన్స్ ఇష్ట‌ప‌డ‌రు. సోష‌ల్ మీడియాలో అల్లు అర్జున్‌ ను మెగాస్టార్‌ గా అభివ‌ర్ణిస్తూ పోస్ట్ లు వెలువ‌డుతున్నాయి. వీటికి తోడు డీజే ప్రమోష‌న్ సంద‌ర్భంగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్య‌లు మెగా అభిమానుల‌ను జీర్ణించుకోలేక పోతున్నారు.

మెగా ఫ్యామిలీలోని యువ హీరోల్లో తాను నెం.1 స్థానంలో ఉండాల‌ని అభిమానులు కోరుకుంటే దానిని కాంప్లిమెంట్ లా తీసుకుంటాన‌ని బన్నీ మీడియాకు చెప్పాడు. బ‌న్నీకి వ‌రుస హిట్లు రావ‌డం వ‌ల్లే ఇలా మాట్లాడుతున్నాడ‌ని రామ్ చ‌ర‌ణ్ అభిమానులు అనుకుంటున్నార‌ట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/