Begin typing your search above and press return to search.

`పుష్ప` క‌థ‌ను లీక్ చేసిన‌ ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్

By:  Tupaki Desk   |   12 May 2020 10:00 AM IST
`పుష్ప` క‌థ‌ను లీక్ చేసిన‌ ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్
X
అభిమానుల అత్యుత్సాహం అనాలా? లేక ప‌ర్ఫెక్ట్ మార్ఫింగ్ స్కిల్ అనాలా? ఏమో.. మొత్తానికి తాజాగా రిలీజైన `పుష్ప` ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్ ర‌క‌ర‌కాల సందేహాల్ని రాజేస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గెటప్ ఇదీ అని ఇంత‌కుముందు అధికారికంగా రిలీజైన‌ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ చూడ‌గానే అర్థ‌మైంది. అతడి పాత్ర తీరుతెన్నులు ఎలా ఉండ‌బోతున్నాయి? అన్న‌ది రివీలైంది. ఇక అప్ప‌టికే పుష్ప క‌థ గురించి బోలెడంత స‌మాచారం ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది. ఎర్ర‌చంద‌నం దుంగ‌ల స్మగ్ల‌ర్ల క‌థాంశం ఎంచుకుని సుకుమార్ స‌రికొత్త ర‌గ్గ్ డ్ మూవీని తెర‌కెక్కిస్తున్నాడ‌ని ప్ర‌చార‌మైంది. చిత్తూరు శేషాచ‌లం అడ‌వుల్లో స్మ‌గ్ల‌ర్ల అరాచ‌కాల‌పై సినిమా ఇది. ఇందులో బ‌న్ని ఒక లారీ డ్రైవ‌ర్ గా న‌టిస్తున్నాడ‌ని.. పోలీసుల‌తో ఛేజ్ లు ఎటాక్ లు ఇవ‌న్నీ ఉంటాయ‌ని.. అప్ప‌టికే బోలెడ‌న్ని లీకులు అందాయి.

స‌రిగ్గా ఈ సినిమా క‌థ‌ను.. బ‌న్ని పాత్ర‌ను ఇమాజినేట్ చేసి తాజాగా డిజైన్ చేసిన ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది. ఎదురొచ్చిన‌ పోలీసోళ్ల‌ను ఏసేసి వాళ్ల జీప్ లోనే ఎక్కించి జీప్ ఫ్రంట్ టాప్ పై ఎక్కి కూచుని చుట్ట కాలుస్తున్నాడు బ‌న్ని. ఈ పోస్ట‌ర్ ఏదో మ‌ల‌యాళ చిత్రం పోస్ట‌ర్ లా క‌నిపిస్తోంది. అందులో బ‌న్ని హెడ్ మాత్ర‌మే మార్ఫింగ్ చేసారని అర్థ‌మ‌వుతోంది. అయితే పుష్ప క‌థాంశాన్ని ఎక్క‌డా డైవ‌ర్ట్ చేసేలా ఈ పోస్ట‌ర్ లేనే లేదు.

ప‌క్కాగా క‌థ‌ను ఎలివేట్ చేసేదిగా క‌నిపిస్తోంది. ఎర్ర‌చంద‌నం దుంగ‌ల్ని ఎత్తుకెళుతున్న లారీ డ్రైవ‌ర్ ని ఛేజ్ చేసిన పోలీసుల‌కు ఇలాంటి గ‌తి ప‌డుతుంది! అన్న అర్థం స్ఫురిస్తోంది. అంటే సుకుమార్ కంటే అద్భుతంగా ఫ్యాన్స్ ఆ స‌న్నివేశాన్ని ఇమాజినేష‌న్ చేసుకున్నార‌న్న‌మాట‌. మొత్తానికి ఫ్యాన్స్ చేస్తున్న ప‌నికి పుష్ప క‌థంతా లీకైపోతోంది.