Begin typing your search above and press return to search.

బన్నీకి అభిమానుల కానుక అదిరింది

By:  Tupaki Desk   |   8 April 2018 4:17 AM GMT
బన్నీకి అభిమానుల కానుక అదిరింది
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు అభిమానులు పుట్టిన రోజు సందర్భంగా మరిచిపోలేని కానుక ఇచ్చారు. విశాఖ ఆర్కే బీచ్‌లో భారీ సైకత శిల్పం ఏర్పాటు చేసి బన్నీ పుట్టిన రోజు వేడుకలు జరిపారు. అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో వైజాగ్ బీచ్ లో భారీ సైకత శిల్పాన్ని రూపొందించారు. ప్రముఖ సైకత శిల్పి మానస్ సాహు దీన్ని రూపొందించారు. ఈ శిల్పంలో అల్లు అర్జున్ చిత్రంతో పాటు ఆయన తాజాగా నటిస్తున్న నా పేరు సూర్య టైటిల్ కూడా ఉండడం విశేషం.

కాగా అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం నా పేరు సూర్యకు వక్కంతం వంశి దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ ఈ చిత్రంలో ఆర్మీ మాన్ గా అలరించబోతున్నాడు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న బన్నీ ఈ చిత్రంతో తన విజయ పరంపర కొనసాగిస్తారని అంతా అనుకుంటున్నారు. అభిమానులైతే ఈ చిత్రం కోసం నిరీక్షిస్తున్నారు.

గంగోత్రి చిత్రంతో అల్లు అర్జున్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మెగా మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన బన్నీ తన నటన, డాన్సులతో ప్రత్యేకంగా అభిమానులని సొంతం చేసుకున్నాడు. బన్నీ ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బాక్సాఫీసులో కనక వర్షం కురిపించే బన్నీ నేడు 35వ పుట్టిన రోజు జరుపుకొంటున్న సందర్భంగా అభిమానుల్లో సందడి ఏర్పడింది.