Begin typing your search above and press return to search.

స‌ర్కారు వారిపై బ‌న్నీ ఫ్యాన్స్ ఫైర్

By:  Tupaki Desk   |   20 March 2022 10:00 PM IST
స‌ర్కారు వారిపై బ‌న్నీ ఫ్యాన్స్ ఫైర్
X
స‌ర్కారు వారిపై బ‌న్నీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నార‌ట‌. త‌మ హీరో పాట‌ల్ని కాపీ చేస్తున్నారంటూ ఓ రేంజ్ లో నెట్టింట బ‌న్నీ ఫ్యాన్స్ మ‌హేష్ బాబు సినిమాపై ఫైర్ అవుతున్న తీరు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది. వివార‌ల్లోకి వెళితే.. `అల వైకుంఠ‌పుర‌ములో` నుంచి త‌మ‌న్ కెరీర్ మామూలుగా లేదు. ఓ రేంజ్‌లో సాగిపోతూ ఇండ‌స్ట్రీ వ‌ర్గాలని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. `అల వైకుంఠ‌పుర‌ములో` ఇండ‌స్ట్రీ హిట్ గా నిల‌వ‌డంతో త‌మ‌న్ పాత్ర చాలా వుంది. త‌న అద్భుత‌మైన సంగీతంతో సినిమా విజయానికి త‌మ‌న్ ప్రధాన బ‌లంగా నిలిచాడ‌న్న‌ది అంద‌రికి తెలిసిందే.

ఆ త‌రువాత చేసిన చిత్రాల‌కు కూడా త‌మ‌న్ బ్లాక్ బ‌స్ట‌ర్ మ్యూజిక్ ని అందించాడు. ర‌వితేజ క్రాక్‌, నంద‌మూరి బాల‌కృష్ణ `అఖండ‌`, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ `భీమ్లానాయ‌క్‌`... ఈ చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ లుగా నిల‌వ‌డంలో త‌మ‌న్ అందించిన పాత్ర ,ఆలా ప్ర‌త్యేక‌మైన‌ది. పాటలు, నేప‌థ్య సంగీతం విష‌యంలో త‌మ‌న్ పెట్టిన శ్ర‌ద్ద కార‌ణంగానే ఈ చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ లుగా నిలిచాయి. దీంతో త‌మ‌న్ ఇప్ప‌డు వ‌రుస క్రేజీ చిత్రాల‌కు సంగీతం అందిస్తున్నాడు.

అందులో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టిస్తున్న `స‌ర్కారు వారి పాట‌` చిత్రం కూడా వుంది. ఇటీవ‌ల ఈ చిత్రానికి సంబంధించిన రెండు లిరిక‌ల్ వీడియోల‌ని మేక‌ర్స్ ఇప్ప‌టికే విడుద‌ల చేశారు కూడా. అయితే ముందు విడుద‌ల చేసిన క‌ళావ‌తి...` రీసెంట్ గా విడుద‌ల చేసిన పెన్నీ.. సాంగ్ `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంలోని సామ‌జ‌వ‌ర గ‌మ‌న‌..., ఓ మై డాడీ పాట‌ల‌ని త‌ల‌పిస్తున్నాయ‌ని, మా హీరో పాట‌ల‌ని కాపీ ఎందుకు చేస్తున్నార‌ని బ‌న్నీ ఫ్యాన్స్ `స‌ర్కారు వారి పాట‌` టీమ్ తో పాటు సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ పై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నార‌ట‌.

`స‌ర్కారు వారి పాట‌` నుంచి విడుద‌లైన రెండు లిరిక‌ల్ వీడియోల్లోనూ `అల వైకుంఠ‌పుర‌ములో` కు అందించిన మ్యూజిక్ ఫార్మాట్ లోనే వుండ‌టం ఇప్ప‌డు ఫ్యాన్స్ మ‌ధ్య వివాదానికి కార‌ణంగా మారింద‌ని అంటున్నారు. బ‌న్నీ ఫ్యాన్స్ మ‌హేష్ బాబుని ఉద్దేశించి సోష‌ల్ మీడియా వేదిక చేస్తున్న కామెంట్స్ హార్ష్‌గా వున్నాయ‌ని, మ‌హేష్ సాంగ్స్ విష‌యంలో మ‌హేష్ ఒరిజిన‌ల్ మ్యూజిక్ ని ప్రిఫ‌ర్ చేస్తే బాగుంటుంద‌ని కామెంట్ లు చేస్తున్నార‌ట‌.

బ‌న్నీ ఫ్యాన్స్ ఇలా వ్య‌వ‌హ‌రిస్తూ `స‌ర్కారు వారి పాట‌` సాంగ్స్ ని వివాదం చేస్తుంటే మ‌హేష్ ఫ్యాన్స్ మాత్రం త‌మ‌న్ వ‌ర్క్ ని చూసి హ్యాపీగా ఫీల‌వుతున్నార‌ట‌. త‌మ అభిమాన హీరో క్రేజీ మూవీకి బ్లాక్ బ‌స్ట‌ర్ ఆల్బ‌మ్ ని అందించినందుకు ఓ రేంజ్ లో పండ‌గ చేసుకుంటున్నార‌ట‌. `స‌ర్కారు వారి పాట‌` చిత్రానికి ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్, 14 ప్ల‌స్ రీల్స్, జీఎంబీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.