Begin typing your search above and press return to search.

మ‌ల్లు అర్జున్ చేసిన ప‌నికి వాళ్లంతా గ‌రంగ‌రమ్

By:  Tupaki Desk   |   10 April 2020 10:15 AM IST
మ‌ల్లు అర్జున్ చేసిన ప‌నికి వాళ్లంతా గ‌రంగ‌రమ్
X
క‌రోనా క‌ల్లోలం నేప‌థ్యంలో లాక్ డౌన్ ప్ర‌జ‌ల్ని తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వ్య‌వ‌స్థ స్థంభించిపోయి ఆర్థిక వ్య‌వ‌స్థ అత‌లాకుత‌లం అయిపోతుంటే బెంబేలెత్తే ప‌రిస్థితి ఉంది. అంత‌కుమించి సామాన్య జ‌నం కూటికి లేక త‌ల్ల‌డిల్లిపోయే ధైన్యం నెల‌కొంది. ఇలాంటి స‌మ‌యంలో తెలుగు సినీ స్టార్లు స్పందిస్తున్న తీరుపై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఇక కేవ‌లం తెలుగు రాష్ట్రంలో పుట్టి తెలుగు వారికే సాయం చేస్తే అదేమంత గొప్ప కాదు కానీ.. ఇక్క‌డ పుట్టి దేవుని స్వ‌స్థ‌లం అయిన కేర‌ళ‌కు సాయం చేస్తూ బ‌న్నీ అంద‌రి నోళ్ల‌లో నానుతున్నాడు. ముఖ్యంగా మ‌ల‌బారు తీరంలో మ‌ల్లు అర్జున్ పై ప‌దే ప‌దే ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. కేర‌ళ‌కు క‌ష్టం వ‌స్తే ఒక తెలుగు వాడు ఇలా స్పందించ‌డ‌మేమిటి? అంటూ అక్క‌డ స్టార్లు సైతం కుళ్లుకునేలా.. ప్ర‌భుత్వాల చేత చీవాట్లు తినిపించేంత‌గా సాయం చేస్తున్నాడు బ‌న్నీ.

లాక్ డౌన్ నేప‌థ్యంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తెలుగు రాష్ట్రాల‌కు..కేర‌ళ ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి భారీగా విరాళం ఇచ్చి దాతృ హృద‌యాన్ని చాటుకున్నాడు. అద‌నంగా మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన సీసీసీ చారిటీకి మ‌రో 20 ల‌క్ష‌లు డొనేష‌న్ ఇచ్చి బ‌న్నీ రియ‌ల్ హీరోగా నిలిచాడు. అయితే తాజాగా కేర‌ళ‌కు ఇచ్చిన 25ల‌క్ష‌ల విరాళం పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ బ‌న్నీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు. కేర‌ళ ప్ర‌జ‌లు ఎప్ప‌టికీ బ‌న్నీకి రుణ‌ప‌డి ఉంటార‌ని..ఇలాంటి విప‌త్తుల స‌మ‌యంలో బ‌న్నీ ఎన్నోసార్లు సాయం చేసారు.. ఆ స‌హాయ‌న్ని ప్ర‌జ‌లు ఎప్ప‌టికీ మ‌ర్చిపోరు.. మీలాంటి వాళ్ల సాయం ఇప్పుడు అంద‌రికీ అవ‌స‌రమ‌ని సూచించారు. ఇక గ‌తంలో కూడా బ‌న్నీ ఎన్నోసార్లు కేర‌ళీయుల‌కు విరాళాలు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల‌ కేర‌ళ‌ను వ‌ర‌ద‌లు ముంచెత్తినపుడు మొట్ట‌మొద‌ట‌గా స్పందించి భారీగా విరాళం అందించింది బ‌న్నీనే. ఆ త‌ర్వాత కూడా ఏమాత్రం స్పందించ‌ని మ‌ల్లూ స్టార్ల‌కు బాగానే అక్షింత‌లు వేశారు జ‌నం. సాక్షాత్తూ కేర‌ళ టూరిజం మంత్రి మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ల‌ను దెప్పి పొడిచారు. ఆ క్ర‌మంలోనే బ‌న్నీ చేసిన ప‌నికి స్థానిక స్టార్లు కుళ్లుకోవాల్సిన ప‌రిస్థితి.. అసూయ చెందాల్సిన ధైన్యం ఎదురైంది.

ఇక‌పోతే క‌రోనా ఉత్పాతం వేళ తొలిగా స్పందించింది మ‌న బ‌న్నీనే. దీంతో ఇప్పుడు కూడా అక్క‌డ స్టార్ల ప‌రిస్థితి అలానే ఉంద‌ని ఊహించ‌డంలో త‌ప్పేమీ లేదు. ఇక బ‌న్నీకి మ‌ల‌యాళంలో ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అక్క‌డ బ‌న్నీని ముద్దుగా మ‌ల్లు అర్జున్ అని పిలుస్తుంటారు. ఆయ‌న న‌టించిన ప్ర‌తీ సినిమా అక్క‌డ అనువాద‌మై భారీ ఎత్తున ఓ తెలుగు సినిమాలా రిలీజ్ అవుతుంది. అక్క‌డి టాప్ స్టార్ల‌కు బ‌న్నీ మంచి పోటీ ఇస్తుంటాడు. బ‌న్నీ అంటే అక్క‌డి ప్ర‌జ‌లు సైతం ప్ర‌త్యేక‌మైన అభిమానాన్ని చూపించ‌డం వెన‌క సేవాగుణం గుప్త‌దానాలు ఒక కార‌ణం అని భావించ‌వ‌చ్చు. మ‌న హీరోల్లో ఏ హీరోకి లేనంత క్రేజ్ బ‌న్నీకి మ‌ల‌యాళంలో ఉండ‌టం విశేషం. రామ్ చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్- ప్ర‌భాస్ లాంటి వాళ్లు ప్ర‌య‌త్నిస్తున్న‌ప్ప‌టికీ బ‌న్నీ లా దూసుకెళ్ల‌లేకపోయారంటే అర్థం చేసుకోవ‌చ్చు. బ‌న్నీ ఆప‌న్న హ‌స్తం అక్క‌డి ప్ర‌జ‌ల్లో ఎంతో ప్రేమ‌కు ఆద‌ర‌ణ‌కు కార‌ణ‌మ‌వుతుంది. బ‌న్నీ తెలుగు వాడైనా త‌మపై చూపే ప్రేమ‌కు దేవుని స్వ‌స్థ‌లం ఎప్పుడో దాసోహం అయ్యింది అందుకే.