Begin typing your search above and press return to search.
బన్నీకి మూడో స్థానం కట్టబెట్టేయొచ్చా?
By: Tupaki Desk | 14 March 2016 5:30 PMనాలుగేళ్లు వెనక్కి వెళ్తే.. అల్లు అర్జున్ ను టాప్ హీరోల లీగ్ లో చేర్చడానికి కొంచెం సందేహించే వాళ్లు. కానీ ‘జులాయి’ దగ్గర్నుంచి సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ దూసుకెళ్లిపోతున్నాడు బన్నీ బాబు. అందులోనూ గత రెండేళ్లలో బన్నీ జోరు మామూలుగా లేదు. చూస్తుండగానే ఇంతింతై అని ఎదిగిపోయి.. టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడిగా ఎదిగిపోయాడు. ప్రస్తుతం టాలీవుడ్లో వరుసగా మూడు యాభై కోట్ల షేర్ సినిమాల్ని అందించిన ఏకైక హీరో బన్నీనే కావడం విశేషం. ‘రేసుగుర్రం’ రూ.60 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేస్తే.. ఏవరేజ్ అనిపించుకున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ కూడా 50 కోట్లకు పైనే వసూలు చేసింది. బన్నీ అతిథి పాత్ర పోషించిన ‘రుద్రమదేవి’ కూడా ఈ క్లబ్బులో అడుగుపెట్టింది.
ఇక ‘సరైనోడు’ బిజినెస్ లెక్కలు చూస్తుంటే టాలీవుడ్ జనాలకు దిమ్మదిరుగుతోంది. టాలీవుడ్ లో తిరుగులేని మార్కెట్ ఉన్నది పవన్ కళ్యాణ్ - మహేష్ బాబులకే. వాళ్లిద్దరినీ అసలు సిసలు సూపర్ స్టార్లుగా భావిస్తారు అందరూ. జూనియర్ ఎన్టీఆర్ - ప్రభాస్ - రామ్ చరణ్ లకూ మంచి మార్కెట్ - ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కానీ.. పవన్ - మహేష్ ల రేంజే వేరుగా ఉంటుంది. వాళ్లను మిగతా వాళ్లు టచ్ చేయడం చాలా కష్టం. ఐతే ఒకప్పుడు పైన చెప్పుకున్న ముగ్గురి కంటే కూడా తక్కువ స్థాయిలో ఉన్న బన్నీ.. ఇప్పుడు పవన్ - మహేష్ లను టచ్ చేసేస్తున్నాడు.
‘సరైనోడు’ బిజినెస్.. సర్దార్ గబ్బర్ సింగ్ - బ్రహోత్సవం సినిమాలకు దగ్గరగా ఉండటం.. కొన్ని ఏరియాల్లో వాటిని దాటేస్తుండటం చూస్తుంటే బన్నీ సత్తా ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్ లో నెంబర్ వన్ ఎవరన్నది తేల్చడం కష్టం. పవన్ - మహేష్.. ఇద్దరూ ఇద్దరే. ఎవరికి ఎవరూ తీసిపోరు. ఎవర్ని ఎవరూ మించరు. కాబట్టి 1, 2 స్థానాల్ని వాళ్లిద్దరికీ ఇచ్చేయొచ్చు. ఐతే మూడో స్థానం విషయంలో మాత్రం ఇప్పుడు క్లారిటీ వచ్చేసినట్లే కనిపిస్తోంది. ప్రస్తుత లెక్కల ప్రకారమైతే ఆ స్థానాన్ని బన్నీకి కట్టబెట్టేయొచ్చు. ఈ స్థానానికి ప్రభాస్ - ఎన్టీఆర్ కూడా పోటీలో ఉంటారు. ఐతే ప్రభాస్ అసలు స్టామినా ఏంటన్నది ‘బాహుబలి’ తర్వాత వచ్చే సినిమాను బట్టి చెప్పొచ్చు. ఎన్టీఆర్ సంగతి ‘జనతా గ్యారేజ్’ విడుదలైనపుడు చూద్దాం.