Begin typing your search above and press return to search.

డీజే టీజ‌ర్.. సైలెంటుగా రికార్డు కొట్టేసిందే

By:  Tupaki Desk   |   19 March 2017 4:47 PM GMT
డీజే టీజ‌ర్.. సైలెంటుగా రికార్డు కొట్టేసిందే
X
అంద‌రూ ‘బాహుబ‌లిః ది కంక్లూజ‌న్’ ట్రైల‌ర్ ప్ర‌కంప‌న‌ల గురించే మాట్లాడుకుంటున్న స‌మ‌యంలో అల్లు అర్జున్ దువ్వాడ జ‌గ‌న్నాథం టీజ‌ర్ యూట్యూబ్ లో రికార్డు కొట్టేసింది. తెలుగులో ‘బాహుబ‌లి’ కాకుండా అత్యంత వేగంగా కోటి వ్యూస్ పూర్తి చేసుకున్న టీజ‌ర్ ‘డీజే’దే కావ‌డం విశేషం. కొన్ని రోజుల కింద‌టే కోటి వ్యూస్ పూర్తి చేసుకున్న తొలి టాలీవుడ్ టీజ‌ర్ గా ‘కాట‌మ‌రాయుడు’ రికార్డు నెల‌కొల్పిన సంగ‌తి తెలిసిందే. ఐతే ‘కాట‌మ‌రాయుడు’ తర్వాత వ‌చ్చిన ‘డీజే’ టీజ‌ర్.. దాని కంటే వేగంగా దూసుకెళ్లింది. ప‌వ‌న్ టీజ‌ర్ 10 మిలియ‌న్ వ్యూస్ పూర్తి చేసుకోవ‌డానికి నెల‌కు పైగా స‌మ‌యం తీసుకోగా.. ‘డీజే’ టీజ‌ర్ 24వ రోజుకే.. స‌రిగ్గా 555 గంట‌ల్లో ఈ మైలురాయిని దాటింది.

సౌత్ ఇండియాలో అత్యంత వేగంగా కోటి వ్యూస్ పూర్తి చేసుకున్న మూడో టీజ‌ర్ ‘డీజే’దే కావ‌డం మ‌రో విశేషం. ఈ టీజ‌ర్ కు ఇప్ప‌టిదాకా 1.75 ల‌క్ష‌ల లైక్స్ వ‌చ్చాయి. దీని డిజ్ లైక్స్ కూడా త‌క్కువేమీ లేవు. 1.6 ల‌క్ష‌ల డిజ్ లైక్స్ ప‌డ్డాయి ఇప్ప‌టిదాకా. ఈ టీజ‌ర్ రిలీజైన‌ప్ప‌టి నుంచి యాంటీ ఫ్యాన్స్ అదే ప‌నిగా డిజ్ లైక్స్ కొట్ట‌డం వివాదాస్ప‌ద‌మైన సంగ‌తి తెలిసిందే. కేవ‌లం 5 గంట‌ల 12 నిమిషాల్లోనే మిలియ‌న్ వ్యూస్ పూర్తి చేసుకున్న ‘డీజే’ టీజ‌ర్.. 5 మిలియ‌న్ వ్యూస్ మార్కును 76 గంట‌ల్లో అందుకుంది. ఈ టీజ‌ర్ ఊపును బ‌ట్టి అల్లు అర్జున్ ఫాలోయింగ్ అంత‌కంత‌కూ ఎలా పెరుగుతోందో అర్థం చేసుకోవ‌చ్చు. మ‌రి ‘దువ్వాడ జ‌గ‌న్నాథం’ ట్రైల‌ర్ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/