Begin typing your search above and press return to search.

దువ్వాడ రెడీ అయిపోయాడు

By:  Tupaki Desk   |   16 Jun 2017 4:21 PM GMT
దువ్వాడ రెడీ అయిపోయాడు
X
‘దువ్వాడ జ‌గ‌న్నాథం’ జూన్ 23న ప‌క్కా అని అధికారికంగా ఖ‌రారైంది. విడుద‌ల‌కు ముందు కీల‌క‌మైన తంతును ఈ సినిమా పూర్తి చేసుకుంది. ‘దువ్వాడ జ‌గ‌న్నాథం’కు సెన్సార్ బోర్డు వాళ్లు యు/ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చారు. ఇంకా నిడివి విష‌య‌మై క్లారిటీ రాలేదు. విడుద‌లకు వారం ముందే సెన్సార్ పూర్త‌వ‌డంతో ఇక స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ సంబ‌రాలు షురూ అయిపోయినట్లే. 22న భారీ స్థాయిలో ఓవ‌ర్సీస్ ప్రిమియ‌ర్స్ కు స‌న్నాహాలు మొద‌లైపోయాయి. బ‌న్నీ కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ రిలీజ్ అంటున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు 1800 థియేట‌ర్ల‌లో సినిమా విడుద‌ల‌య్యే అవ‌కాశ‌ముంది.

సెన్సార్ పూర్త‌యిన సంద‌ర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘దువ్వాడ జ‌గ‌న్నాథం మా సంస్థ‌లో వ‌స్తోన్న 25వ సినిమా. ఈ నెల 23న బ్ర‌హ్మాండంగా విడుద‌ల చేస్తున్నాం. ఓవ‌ర్సీస్‌ లోనే 300 థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్నామంటే ఎంత ప్ర‌తిష్టాత్మ‌కంగా, భారీగా చిత్రం విడుద‌ల‌కు ప్లాన్ చేస్తున్నామో అర్థం చేసుకోవ‌చ్చు.బన్ని, హరీష్‌ కాంబినేషన్‌ లో 25వ సినిమా చేయడం ఆనందంగా ఉంది.23న సినిమానే మాట్లాడుతుంది. సినిమా చూసి బయటకు వచ్చి గర్వంగా చెప్పుకునేలా సినిమా ఉంటుంది’’ అన్నాడు. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ‘దువ్వాడ జ‌గ‌న్నాథం’లో బ‌న్నీ స‌ర‌స‌న పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టించింది. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతాన్నందించాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/