Begin typing your search above and press return to search.

బన్నీ కండల వెనక అంత తిండి ఉందట

By:  Tupaki Desk   |   15 May 2016 10:40 AM IST
బన్నీ కండల వెనక అంత తిండి ఉందట
X
సెలెక్టివ్ గా సినిమాలు చేయటం బన్నీకి అలవాటే. తాను నటించే ఏ సినిమాకు.. పోలిక లేని విధంగా జాగ్రత్త పడటమే కాదు.. తన ప్రతిసినిమాలోనూ లుక్.. గెటప్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు ఈ స్టైలీష్ స్టార్. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఊరమాస్ సినిమా అయిన సరైనోడులో కండలు బన్నీ పెంచిన కండలు స్పష్టంగా కనిపించాయి.

ఫిట్ గా కనిపించటంతో పాటు.. పెరిగిన కండలు వెండితెర మీద స్పష్టంగా కనిపించాయి. మరి.. అంతేసి కండలు పెంచటానికి బన్నీ ఎంత కసరత్తు చేశాడన్న విషయం తెలిస్తే.. ఉత్తినే స్టార్లు అయిపోరన్న విషయం అర్థమవుతుంది. సరైనోడు సినిమాలో కండలు పెంచాల్సిన రావటంతో తాను స్పెషల్ డైట్ తీసుకోవటమే కాదు.. గంటల కొద్దీజిమ్ లో గడిపినట్లుగా బన్నీ చెప్పుకొచ్చారు.

క్రమపద్ధతిలో కండలు పెరిగేందుకు రోజుకు ఆరుసార్లు తినేవాడినని చెప్పారు అల్లుఅర్జున్. సినిమాకు తగ్గట్లు పెంచిన కండల్ని తగ్గించే ప్రయత్నంలో పడ్డారు అల్లు అర్జున్. సరైనోడు సినిమా సమయంలో రోజుకు ఆరు విడతలగా తినేసిన బన్నీ ఇప్పుడు తన డైట్ చార్ట్ ను మార్చాడట. ఇప్పుడు తన రెగ్యులర్ డైట్ లోకి వచ్చేశాడట. అంటే.. తర్వాతి సినిమాలో కండలు తిరిగిన అల్లు అర్జున్ కనిపించడన్న మాట.