Begin typing your search above and press return to search.

బర్త్ డే మూడ్ లో స్టైలిష్ స్టార్ ఫ్యామిలీ

By:  Tupaki Desk   |   21 Nov 2018 12:17 PM GMT
బర్త్ డే మూడ్ లో స్టైలిష్ స్టార్ ఫ్యామిలీ
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ -స్నేహా రెడ్డి ముద్దుల కూతురు అల్లు అర్హ ఈరోజు రెండో పుట్టిన రోజు జరుపుకుంటోంది. దీంతో అల్లు అర్జున్ స్నేహ ఇద్దరూ తమ లిటిల్ ఏంజెల్ కు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. బన్నీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక క్యూట్ ఫోటో పోస్ట్ చేసి 'హ్యాపీ బర్త్ డే టూ మై చబ్బీ డాల్ అర్హ' అంటూ ట్వీట్ చేశాడు.

మరో వైపు స్నేహ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా 'హ్యాపీ హ్యాపీ బర్త్ డే అర్హా' అంటూ మరో బ్యూటిఫుల్ ఫోటో పోస్ట్ చేసింది. బన్నీ.. స్నేహల ఫోటోలను లైక్ చేస్తూ అభిమానులు బుజ్జి అర్హ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ - స్నేహ తమ పిల్లలను తీసుకుని గోవా కు వెళ్ళారట. అర్హ బర్త్ డే ని గోవాలోనే సెలబ్రేట్ చేసుకుంటూ పిల్లలతో ఎంజాయ్ చేస్తారట. ఇన్ స్టాగ్రామ్ ద్వారా స్నేహ గోవా బీచ్ ఫోటో ఒకటి పోస్ట్ చేయడం తో ఈ విషయం తెలిసింది.

అల్లు అర్జున్ - స్నేహ దంపతులకు మొదట ఒక బాబు. ఆ బుజ్జి స్టైలిష్ స్టార్ పేరు అయాన్. అర్హ రెండో సంతానం. 2016 నవంబర్ 21 న జన్మించింది అర్హ. అర్జున్(Arjun) పేరు లోని మొదటి రెండు అక్షరాలను.. స్నేహ(Sneha) పేరులోని చివరి రెండు అక్షరాలను కలిపి పాపకు అర్హ అనే పేరు పెట్టారు.