Begin typing your search above and press return to search.

బన్నీ సిక్సర్ కొట్టాడు

By:  Tupaki Desk   |   28 April 2016 1:30 PM GMT
బన్నీ సిక్సర్ కొట్టాడు
X
సినిమా సినిమాకూ తన ఫాలోయింగ్ పెంచుకుంటూ దూసుకెళ్లిపోతున్నాడు. గత రెండు మూడేళ్లలోనే అతడి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఒక్క మాస్ ఆడియన్స్‌ లో మాత్రమే కొంచెం ఫాలోయింగ్ పెంచుకోవాల్సి ఉందనుకుంటుండగా.. తాజాగా ‘సరైనోడు’ సినిమాతో ఆ లోటు కూడా తీర్చేసుకున్నాడు బన్నీ. డివైడ్ టాక్‌ తో మొదలైన ఈ సినిమా మాస్ ప్రేక్షకుల ఆదరణతో అనూహ్యమైన కలెక్షన్లు సాధిస్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.31 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది ‘సరైనోడు’. మిగతా ఏరియాలన్నీ కూడా కలుపుకుంటే ఈ సినిమా ఇప్పటికే రూ.40 కోట్లకు పైనే వసూలు చేసినట్లు అంచనా. బన్నీ కెరీర్ లోనే ఇది హైయెస్ట్ గ్రాసర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

సరైనోడు బన్నీ ఖాతాలో మరో అరుదైన రికార్డును జమ చేసింది. నైజాం ఏరియాలో పది కోట్ల షేర్ మార్కును వరుసగా ఆరోసారి అందుకున్న ఏకైక టాలీవుడ్ హీరోగా రికార్డు సృష్టించాడు బన్నీ. ‘సరైనోడు’ ఆరో రోజుకే నైజాంలో రూ.10.4 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం. జులాయితో తొలిసారి నైజాంలో రూ.10 కోట్ల షేర్ మార్కును అందుకున్న బన్నీ.. ఆ తర్వాత ఇద్దరమ్మాయిలతో లాంటి ఫ్లాప్ మూవీతో కూడా ఆ మార్కును టచ్ చేశాడు. ఆపై రేసుగుర్రం - సన్నాఫ్ సత్యమూర్తి - రుద్రమదేవి కూడా నైజాంలో పది కోట్లకు పైగా షేర్ వసూలు చేశాయి. ఇప్పుడు ‘సరైనోడు’ కూడా ఆ జాబితాలో చేరింది. ఫుల్ రన్ లో ఈ సినిమా రూ.14-15 కోట్ల దాకా వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.