Begin typing your search above and press return to search.

అడ‌గొద్దు బ్ర‌ద‌ర్‌...మీడియాకు బ‌న్నీ కండిష‌న్‌!

By:  Tupaki Desk   |   19 Jun 2017 8:16 PM IST
అడ‌గొద్దు బ్ర‌ద‌ర్‌...మీడియాకు బ‌న్నీ కండిష‌న్‌!
X
గతంలో ఓ సందర్భంలో.... చెప్పను బ్రదర్... అంటూ మీడియాకు బుక్కయిన బన్నీ ఈ సారి జాగ్రత్తపడ్డట్లున్నాడు. అందుకే ఈ సారి మీడియాతో మాట్లాడుతున్నపుడు అడగొద్దు బ్రదర్ అని కండిషన్ విధించాడు. జూన్ 23న విడుదల కాబోతున్న దువ్వాడ జగన్నాథం సినిమా గురించి మీడియాతో అల్లు అర్జున్ మాట్లాడాడు. ఈ సందర్భంగా తాను కేవలం డీజే కు సంబంధించిన విషయాలకు మాత్రమే సమాధానం చెబుతానని కండిషన్ పెట్టాడు.

గుడిలో బడిలో.... పాట విషయంలో వివాదం కొన్ని డీజే వీడియోలకు డిస్లైక్లు వచ్చిన నేపథ్యంలో మీడియా ఆ పాటకు సంబంధించిన ప్రశ్నలు అడగకుండా ముందే జాగ్రత్త పడ్డాడు బన్నీ. డీజేకు సంబంధం లేకుండా కొందరు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటేశాడీ స్టైలిష్ స్టార్.

గతంలో చెలరేగిన చెప్పను బ్రదర్... వివాదానికి తెర దించాలని బన్నీ భావించినట్లు కనిపిస్తోంది. అందుకే దాని గురించి ఎక్కడా చర్చించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎన్టీఆర్ పవన్ కల్యాణ్ కూడా తమ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ఇష్టపడేవారు కాదు.