Begin typing your search above and press return to search.

బన్నీ వ్యూహాలు భలే..

By:  Tupaki Desk   |   24 Sept 2016 11:00 PM IST
బన్నీ వ్యూహాలు భలే..
X
కెరీర్ లోనే అద్భుతమైన ఫామ్ లో వున్న అల్లు అర్జున్ ప్రస్తుతం తన అంతలా క్రేజ్ లేని తమిళ దర్శకుడు లింగుస్వామితో చిత్రమంటే అందరూ మొదట్లో ఆశ్చర్యపోయారు. రాయితీ ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన వేడుక చెన్నైలో ఘనంగా జరగడంతో ఒక విషయం మాత్రం స్పష్టమవుతుంది.

బన్నీకి తమిళనాట పెద్ద మార్కెట్ లేదు. తెలుగు రాష్ట్రాలలోనే కాక మలయాళ అభిమానులను సైతం సంపాదించుకున్న బన్నీ ఇప్పుడు తమిళనాట పై దృష్టిపెట్టినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఇటీవల లింగుస్వామి సినిమా ముహూర్తం సాదాసీదాగా కాక ఏకంగా ఒక హీరో లాంచ్ ఈవెంట్ లెవెల్లో నిర్వహించారు. నిర్మాత జ్ఞానవేల్ రాజాకి అరవింద్ కి మంచి సాన్నిహిత్యం వుండడంతో తమ తనయులకు వేరే భాషలో మార్కెట్ సంపాదించుకునే ప్రయత్నంలో ఒకరికొకరు పరస్పరం చేయూత పడుతున్నారు. వచ్చే ఏడాది సూర్య నటిస్తానని చెబుతున్న డైరెక్ట్ తెలుగు ఫిలిం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

బన్నీ తన మార్కెట్ విస్తీరణం కోసం బాగానే వ్యూహరచన చేస్తున్నాడు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తే తమిళనాట కూడా స్టార్ స్టేటస్ తెచ్చుకుంటాడనడంలో సందేహంలేదు. చూద్దాం మరి ఏమవుతుందో..