Begin typing your search above and press return to search.
20 ఏళ్ళ కెరీర్.. ఆ ప్రేమ వల్లే ఇక్కడి వరకు: అల్లు అర్జున్
By: Tupaki Desk | 28 March 2023 12:44 PM GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడిగా, హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామ లింగయ్య మనవడిగా సినీ రంగంలో అడుగు పెట్టినప్పటికీ ఈయనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. 1885లో వచ్చిన విజేత సినిమా ద్వారా బాల నటుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో కాలు మోపిన ఆయన మరో 2003లో గంగోత్రి సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు.
మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. ఆ తర్వాత ఆర్య, బన్ని, హ్యాపీ, దేశముదురు, పరుగు, ఆర్య-2 సినిమాల్లోనూ నటించి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు. మధ్యలో వేదం, వరుడు, బద్రీనాథ్ సినిమాలు డిజాస్టర్లుగా నిలిచిన జులాయి సినిమాతో మళ్లీ హిట్టు కొట్టాడు.
ఆ తర్వాత రేసుగుర్రం, ఎవడు, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు, అల వైకుంఠపురంలో, పుష్ప సినిమాలతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
అయితే ఈయన సినీ రంగంలో అడుగు పెట్టి నేటికి 20 సంవత్సరాలు అవుతుందట. ఇదే విషయాన్ని బన్నీ ట్విట్టర్ వేధికగా వెల్లడించాడు. ప్రేక్షకుల ఆదరాభిమానాలు, ప్రేమ వల్లే తాను ఈ స్థితికి చేరుకున్నట్లు తెలిపాడు. ప్రేక్షకులతో పాటు తన అభిమానులు ఇండస్ట్రీకి చెందిన తన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. భవిష్యత్తులోనూ తనను ఆదరించాలని కోరాడు.
ఈ ట్వీట్ చూసిన అల్లు అర్జున్ అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. కంగ్రాట్స్ అంటూ కొందరు చెబుతుండగా.. చాలా ఏళ్ల పాటు మీరు ఇలాగే స్టార్ హీరోగా కొనసాగుతారని కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. గ్లోబల్ ఐకాన్.. ది పుష్ప రూల్ సినిమా కోసం వెయిటింగ్ అంటూ వివరిస్తున్నారు. మీ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ కి హాట్స్ ఆఫ్ అని చెబుతున్నారు.
ప్రస్తుతం అ్లలు అర్జున్ పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. పుష్ప పార్టు 1 తో పోలిస్తే.. పార్టు 2 మరింత గ్రాండ్ గా ఉండేలా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రీసెంట్ గా హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ను ప్రత్యేకంగా వేసిన సెట్ లో షూట్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే రష్మిక మందన్నా పుష్ప 2 సెట్లోకి అడుగు పెట్టనుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.