Begin typing your search above and press return to search.

క్లిక్‌ క్లిక్‌ : స్టైలిష్‌ స్టార్‌ కు తగ్గ స్టైలిష్‌ ల్యాండ్ రోవర్

By:  Tupaki Desk   |   4 Sept 2020 11:00 AM IST
క్లిక్‌ క్లిక్‌ : స్టైలిష్‌ స్టార్‌ కు తగ్గ స్టైలిష్‌ ల్యాండ్ రోవర్
X
టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌ గా పేరు దక్కించుకున్న అల్లు అర్జున్‌ ఏం చేసినా స్టైలిష్‌ గా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన ఇంటిలోని ఇంటీరియర్‌ నుండి మొదలుకుని కారు ఇంటీరియర్‌ మరియు ఎక్ట్సీరియర్‌ వరకు అన్ని విషయాల్లో కూడా స్టైలిష్‌ బ్రాండ్‌ ను వినియోగిస్తాడు అనడంలో సందేహం లేదు. టాలీవుడ్‌ లో మరెవ్వరికి లేని అత్యంత ఖరీదైన స్టైలిష్‌ కార్‌ వ్యాన్‌ కలిగి ఉన్న అల్లు అర్జున్‌ కార్ల విషయంలో కూడా చాలా అప్‌ డేట్‌ గా ఉంటాడు. ఇటీవల ల్యాండ్‌ రోవర్‌ రేంజ్‌ వోగ్‌‌ కొనుగోలు చేసిన బన్నీ దాన్ని అత్యంత స్టైలిష్ లుక్‌ లోకి లక్షలు ఖర్చు చేసి మోడిఫై చేయించారు.

బన్నీ తీసుకున్న ల్యాండ్‌ రోవర్‌ ను రేస్‌ టెక్‌ అనే కంపెనీ అత్యాధునిక ఫీచర్స్‌ మరియు సెక్యూరిటీ ఫీచర్స్‌ తో మోడిఫై చేయడం జరిగింది. ల్యాండ్‌ రోవర్‌ ఆల్‌ బ్లాక్‌ ట్రీట్మెంట్‌ తో పాటు బ్రాండ్ లోగోను మరియు క్రోమ్‌ ఫినిషింగ్‌ ను కూడా విభిన్నంగా డిజైన్‌ చేసి రాయల్‌ లుక్‌ కు తీసుకు వచ్చారు. వీల్స్‌ పై బన్నీ మార్క్‌ లోగో 'ఏఏ' ను డిజైన్‌ చేయడంతో పాటు అద్బుతమైన స్టైలింగ్‌ తో అదరగొట్టారు. ఫుల్లీ బ్లాక్‌ కోటెడ్‌ స్టైలిష్‌ లుక్‌ లో ఉన్న ఈ కారు అల్లు అర్జున్‌ స్టైలిష్‌ లుక్‌ కు సరిగ్గా సెట్‌ అయ్యిందంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ల్యాండ్‌ రోవర్‌ రేంజ్‌ వోగ్‌ ఎక్స్‌ షో రూం ధర రూ. 2 కోట్ల నుండి ప్రారంభం అవుతుంది. బన్నీ తీసుకున్న ఈ కారు ధరను మరియు దాని మోడిఫై చేయడానికి పట్టిన ధరను మీరే ఊహించుకోండి.