Begin typing your search above and press return to search.

బన్నీ విషెస్ పై ఫ్యాన్స్ ఫైర్

By:  Tupaki Desk   |   2 Sept 2017 8:03 PM IST
బన్నీ విషెస్ పై ఫ్యాన్స్ ఫైర్
X
సాధారణంగా హీరోల మధ్య ఏ స్థాయిలో పోటీ ఉన్నా సరే వారు ఒకరినొకరు ఎదురుపడినప్పుడు చాలా హ్యాపీగా మాట్లాడుకుంటారు. కానీ కొంతమంది జనాలు రూమర్స్ క్రియేట్ చేసి అభిమానుల మధ్య అపోహలను క్రియేట్ చేస్తూ.. వివాదానికి తెరలేపుతారు. అందుకే హీరోలు ఎక్కడైనా ఆచి తూచి మాట్లాడతారు. కానీ మెగా ఫ్యామిలీ కి దగ్గరి బంధువైన అల్లు అర్జున్ చెప్పను బ్రథర్ అంటూ చేసిన వ్యాఖ్యలు ఆయనను ఎంత ఇబ్బందికి గురి చేసిందో తెలిసిన విషయమే.

అసలు పవన్ ఫ్యాన్స్ ను ఉద్దేశించి అల్లు అర్జున్ మాట్లాడకపోయినా ఏమి కాకపోయేది కానీ అనసరంగా ఆయన అభిమానులపై కామెంట్స్ చేసి వివాదాస్పదంగా మారాడు. కాని ఆ తరువాత సిట్యుయేషన్ అర్ధం చేసుకున్న బన్నీ తన పద్దతి మార్చాడు. ఈ రోజు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా అభిమానులతో పాటు చాలామంది ప్రముఖులు విశేష్ చేస్తున్నారు. ఇప్పటికే చరణ్ సోషల్ మీడియా ద్వారా తెలుపగా అభిమానులు చాల హ్యాపీ అయ్యారు. కానీ బన్నీ చెప్పగానే కొంత మంది ఫ్యాన్స్ వ్యతిరేకతను తెలియయజేస్తున్నారు. "మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే PSPK గారు" అని బన్నీ ట్వటేశాడు.

అసలు పవన్ బాబాయ్ అంటూ ఆప్యాయంగా పిలిచే బన్నీ ఇప్పుడు PSPK అని సంబోధించడం వెనుక అనేక అనుమానాలతో కొందరు అభిమానులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరో వైపు బన్నీ ఫ్యాన్స్ కూడా ఆ కౌంటర్లపై సమాధానాన్ని ఇస్తూ సోషల్ మీడియాలో వార్ ని స్టార్ట్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందించడంతో ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి