Begin typing your search above and press return to search.

ఓహో.. బన్నీ కూడా టీమ్ కొనుక్కున్నాడు

By:  Tupaki Desk   |   8 Dec 2016 9:45 AM GMT
ఓహో.. బన్నీ కూడా టీమ్ కొనుక్కున్నాడు
X
ఇప్పుడు తెలుగు హీరోలందరూ ఏదో విధంగా కొత్త కొత్త బిజినెసుల్లో ఇన్వెస్టు చేస్తున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బును ఎక్కడో చోట పెట్టకపోతే ఎలామరి? అందుకే నాగార్జున హోటళ్ళ ఛానళ్లు పెడితే.. ఆయనతో కలసి కొన్నింటిలో చిరంజీవి ఇన్వెస్ట్ చేశారు. అలాగే రామ్ చరణ్‌ కూడా ఎయిర్ లైన్స్ గట్రా నడిపిస్తుంటే.. కొందరు డైరక్టర్లు సాఫ్టువేర్ కంపెనీల్లో ఇన్వెస్టుమెంట్లు పెట్టేశారు.

మొన్నామధ్యన హైదరాబాద్ లో ఒక బ్రూయింగ్ క్లబ్ ఒకటి తెరిచాడు అల్లు అర్జున్. ఇద్దరు పార్టనర్లతో కలసి మనోడు ఇలా హై-ఫై బార్ ను ఓపెన్ చేయడం పెద్ద టాపిక్కే అయ్యింది. అయితే బన్నీ బిజినెస్ యాంగిల్స్ అక్కడితో ఆగట్లేదు. ఆల్రెడీ బన్నీ వాళ్ల డాడీ అరవింద్.. చిరంజీవి అండ్ నాగ్ లతో కలసి కేరళ ఫుట్ బాల్ క్లబ్ () అనే టీమ్ ను కొన్నారు. ఇప్పుడు మనోడేమో బ్యాడ్మింట్మన్ పై మక్కువతో.. బెంగుళూరు బ్లాస్టర్స్ బ్యాడ్మింటన్ టీమ్ ను కొనుక్కున్నాడు. ఈ రెండు టీముల్లోనూ నాగ్.. నిమ్మగడ్డ ప్రసాద్ అండ్ చిరంజీవిల ఇన్వెస్టుమెంట్లు కామన్ గా ఉన్నట్లు తెలుస్తోంది. బన్నీ ఈ టీమ్ కు బ్రాండ్ ఎంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తాడులే.

అదిగో అక్కడ సచిన్ టెండుల్కర్.. పుల్లెల గోపిచంద్ తో ఫోటో దిగి.. నా జీవితంలో ఇదే బెస్ట్ సెల్ఫీ అంటూ షేర్ చేశాడు అల్లు అర్జున్.