Begin typing your search above and press return to search.

బన్నీ వల్లే పేపర్‌ బాయ్‌ కొన్నా : అల్లు అరవింద్‌

By:  Tupaki Desk   |   29 Aug 2018 8:11 AM GMT
బన్నీ వల్లే పేపర్‌ బాయ్‌ కొన్నా : అల్లు అరవింద్‌
X
మొన్నటి వరకు పేపర్‌ బాయ్‌ చిత్రంను ఒక చిన్న, సాదా సీదా చిత్రంగానే అంతా చూశాను. కాని ఎప్పుడైతే అల్లు అరవింద్‌ హోల్‌ సేల్‌ గా సినిమా రైట్స్‌ ను కొనుగోలు చేశాడో అప్పుడే సినిమా స్థాయి అమాంతం పెరిగి పోయింది. భారీ స్థాయిలో ఈ చిత్రంపై అంచనాలు క్రియేట్‌ అయ్యాయి. సినీ వర్గాల వారితో పాటు ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రం గురించిన చర్చ మొదలు అయ్యింది. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక జరిగింది. ఆ సందర్బంగా అల్లు అరవింద్‌ ఈ చిత్రంను తీసుకోవడం వెనుక కారణంను తెలియజేయడం జరిగింది.

ప్రీ రిలీజ్‌ వేడుకలో అల్లు అరవింద్‌ మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం నాకు బన్నీ ఈ చిత్రం ట్రైర్‌ వీడియోను వాట్సప్‌ ద్వారా పంపించాడు. ఆ ట్రైలర్‌ నాకు బాగా నచ్చింది. ఒక సింపుల్‌ కథను దర్శకుడు చక్కగా చూపించాడు అనిపిచింది. అదే సమయంలో నిర్మాత సంపత్‌ నంది సినిమా చూడాల్సిందిగా కోరాడు. ట్రైలర్‌ నచ్చిన కారణంగా సినిమాను చూసేందుకు ఒప్పుకున్నాను. సినిమా చూసిన వెంటనే తప్పకుండా ఈ చిత్రంకు మంచి రిలీజ్‌ అవసరం అని, మంచిగా పబ్లిసిటీ చేసి, రిలీజ్‌ చేస్తే తప్పకుండా మంచి లాభాలు వస్తాయని సంపత్‌ నందికి చెప్పాను. అదే సమయంలో ఈ చిత్రాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాను.

సంపత్‌ నంది మాట్లాడుతూ నిజం చెప్పాలి అంటే ఇదో చిన్న స్టోరీ - చాలా రెగ్యులర్‌ సినిమా కథతో దీన్ని తెరకెక్కించడం జరిగింది. కాని దర్శకుడు స్టోరీని చాలా యూనిక్‌గా తెరకెక్కించాడు. అందుకే ఈ చిత్రంకు ఇంత మంచి రెస్పాన్స్‌ ను చూస్తున్నా. అల్లు అరవింద్‌ ఈ చిత్రంకు కమిట్‌ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎంట్రీతో మా సినిమా స్థాయి పెరిగిందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అల్లు అర్జున్‌కు ట్రైలర్‌ నచ్చడం వల్లే తన తండ్రికి పంపించడం జరిగింది. అు్ల అరవింద్‌ ఈ చిత్రంలో ఎంట్రీ ఇవ్వడానికి ప్రధాన కారణం అల్లు అర్జున్‌ అని చెప్పుకోవాల్సిందే.