Begin typing your search above and press return to search.

'రౌడీ బాయ్స్' ఫంక్షన్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా బన్నీ టీషర్ట్!

By:  Tupaki Desk   |   11 Jan 2022 4:55 AM GMT
రౌడీ బాయ్స్ ఫంక్షన్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా బన్నీ టీషర్ట్!
X
ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ మరింతగా జనంలోకి దూసుకుపోతున్నాడు. ఇతర హీరోల సినిమాల వేడుకలకి ఎక్కువగా హాజరవుతూ, మనస్ఫూర్తిగా వాళ్లని అభినందిస్తూ వెళుతున్నాడు. స్టేజ్ పై ఆయన మాటలు చైతన్యవంతగా .. స్ఫూర్తిదాయకంగా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఆయన నిన్న రాత్రి జరిగిన 'రౌడీ బాయ్స్' సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఆశిష్ రెడ్డి - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ సినిమాను దిల్ రాజు - శిరీష్ నిర్మించగా శ్రీహర్ష కానుగంటి దర్శకత్వం వహించాడు.

ఈ వేడుకలో అల్లు అర్జున్ ధరించిన టి షర్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ బ్రాండ్ ను తనని తాను ప్రమోట్ చేసుకున్న తీరు నచ్చింది. వేదికపై ఆయన మాట్లాడుతూ .. "ఈ ఫంక్షన్ కి విచ్చేసిన 'రౌడీ బాయ్స్'కి .. నా ప్రాణానికి ప్రాణమైన AA ఫ్యాన్స్ కి నమస్కారం. మీరంతా సరదాపడతారని అంటూ వెనక్కి తిరిగి తన టి షర్ట్ పై రాసిన 'ఇది సార్ నా బ్రాండ్' అనే అక్షరాలతో కూడిన అరచేయి ప్రింట్ ఉండటాన్ని చూపించాడు. దాంతో అభిమానులంతా ఒక్కసారిగా ఈలలు వేస్తూ గోల చేశారు. ఇవాళా ఈ ఫంక్షన్ నాకు చాలా స్పెషల్ .. ఆల్ మోస్ట్ వెరీ స్వీట్ మెమొరీ. ఏంటంటే .. నేను నా ప్రయాణాన్ని 'ఆర్య' సినిమాతో మొదలుపెట్టాను. ఆ సినిమా విషయంలో దిల్ రాజు గారు చాలా ముఖ్యమైన పాత్రను పోషించారు.

ఇంతకుముందు సుకుమార్ గురించి మాట్లాడుతూ .. 'ఆర్య' సినిమా లేకపోతే నేను లేను అని చెప్పాను. దిల్ రాజు గారు లేకపోతే 'ఆర్య' సినిమానే లేదు. అలా ఆయన నా కెరియర్ కి సంబంధించి ఒక కీలకమైన పాత్రను పోషించారు. ఆ సినిమా మేము చేసేటప్పుడు ఆశిష్ చాలా చిన్నవాడు. అప్పట్లో 'ఆర్య' సెట్ కి వచ్చి ఆడుకుంటూ ఉండేవాడు. అలాంటి ఆశిష్ హీరో అవుతాడని నేను అనుకోలేదు. మా ఫ్యామిలీకి చెందిన వాళ్లంతా పెద్ద పెద్దవాళ్లయితే నేను ఎంత హ్యాపీగా ఫీలవుతానో ఇప్పుడు నాకు అలా అనిపిస్తోంది. ఇది నా ఫ్యామిలీ ఫంక్షన్ అనిపిస్తోంది.

నిజానికి ఈ రోజున నేను ఊరెళ్లాలి .. కానీ దిల్ రాజు .. శిరీష్ గారు .. మా జర్నీ .. ఆశిష్ ఫస్టు మూవీ .. ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఆగిపోయాను. ఆశిష్ టెన్షన్ ను .. ఆత్రుతను నేను అర్థం చేసుకున్నాను. తప్పకుండా ఆయనకి సపోర్ట్ ఇవ్వాలని ఈ రోజన ఈ ఫంక్షన్ కి వచ్చాను. ఇది నేను చేస్తున్న ఫేవర్ కాదు .. అది నా బాధ్యత. ఇప్పుడు రిలీజ్ చేసిన లవ్ సాంగ్ చాలా బాగుంది. ఫిబ్రవరి 14న పడవలసిన సినిమా, జనవరి 14న పడుతుందేమోనని అనిపించింది. ఆశిష్ ఈ సాంగ్ లో చాలా బాగా డాన్స్ చేశాడు.

జానీ మాస్టర్ చాలా బాగా చేయించారు. డాన్స్ చేసే హీరో ఉంటే ఇంకా ఎక్కువగా స్టెప్పులు వేయించవచ్చు. కాస్త కథ పక్కన పెట్టినా ఫరవాలేదు. ఈ సినిమా జనవరి 14న వస్తుంది. క్రితం నెలలో 'అఖండ' .. 'శ్యామ్ సింగ రాయ్' వచ్చాయి. వాళ్లకి కంగ్రాట్స్ చెప్పే అవకాశం నాకు లభించలేదు. 'శ్యామ్ సింగ రాయ్' సినిమా .. నాని .. సాయిపల్లవి పెర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశాడు. థియేటర్స్ లో మిస్ అయినవాళ్లు ఓటీటీ లో మాత్రం మిస్ కావొద్దు .. సినిమా చాలా బాగుంది. ఇక ఈ సంక్రాంతికి చాలా సినిమాలు వస్తున్నాయి. ఈ సినిమా .. ఆ సినిమా అని కాదు .. అన్ని సినిమాలు ఆడాలి .. ఇది తెలుగు సినిమా గెలవాల్సిన సమయం" అని చెప్పుకొచ్చాడు.