Begin typing your search above and press return to search.

కెమెరామెన్ గా అల్లు అర్జున్.. ఏం క్యాప్చర్ చేశాడో చూడండి!

By:  Tupaki Desk   |   5 Jan 2021 2:24 PM IST
కెమెరామెన్ గా అల్లు అర్జున్.. ఏం క్యాప్చర్ చేశాడో చూడండి!
X
మెరుపు మెరిస్తే.. వాన కురిస్తే.. ఆకాశాన హరివిల్లు విరిస్తే.. అవన్నీ తమకోసమే అని సంబరపడతారు చిన్నారులు. ఆ సమయంలో వారి కళ్లలో కోటి కాంతులు విరజిమ్ముతాయి. ముఖంలో మిలియన్ల మెరుపులు విరబూస్తాయి. మరి, ఆ పిల్లలు తనవాళ్లే అయినప్పుడు ఓ తండ్రి అనుభూతి ఇంకెంత మధురంగా ఉంటుంది? అలాంటి.. సిచుయేషన్స్ ను ఎల్లకాలం పదిలంగా దాచుకునేందుకు కెమెరాతో క్యాప్చర్ చేస్తుంటారు ఈ తరం ఫాదర్స్. తాజాగా.. అల్లు అర్జున్ కూడా అదే చేశారు.

వాస్తవానికి స్టయిలిష్ స్టార్ తన టైనీ టాట్స్ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కబుర్లు చెబుతూనే ఉంటాడు. తనవైఫ్ స్నేహ కూడా అభిమానులతో సంతోషాలను షేర్ చేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు క్యూట్ చిల్డ్రన్ కోసం ఫొటో గ్రాఫర్ గా మారాడు స్టయిలిష్ స్టార్.

తన పిల్లలు అర్హా, అయాన్ తోపాటు మరో చిన్నారి కెమెరాకు స్పెషల్ ఫోజ్ ఇవ్వడంతో.. దాన్ని భద్రంగా క్యాప్చర్ చేశాడు బన్నీ. ఇందులో బన్నీ బేబీ క్వీన్ అర్హా ఇచ్చిన స్వీట్ స్మైల్ విత్ ఎక్స్ ప్రెషన్ ఎంత క్యూట్ గా ఉందో..! ఈ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు స్టయిలిష్ స్టార్. ఫ్యాన్స్ ఈ ఫొటోకు, షూట్ చేస్తున్న బన్నీకి లైకుల వర్షం కురిపిస్తున్నారు.