Begin typing your search above and press return to search.

పొలిటిక‌ల్ లీడ‌ర్ గా అల్లు అర్జున్..?

By:  Tupaki Desk   |   27 Nov 2020 3:40 PM IST
పొలిటిక‌ల్ లీడ‌ర్ గా అల్లు అర్జున్..?
X
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. బన్నీ కెరీర్లో 21వ చిత్రంగా రానున్న ఈ ప్రాజెక్ట్ ని అల్లు అరవింద్ సమర్పణలో యువసుధ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రానికి అల్లు అర్జున్ స్నేహితులు శాండీ - స్వాతి - నట్టి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. సామాజిక అంశాలతో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రాన్ని 2022న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పుడు లేటెస్టుగా బన్నీ - కొరటాల కాంబోలో రాబోతున్న సినిమా నేపథ్యానికి సంబంధించి ఓ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

అల్లు అర్జున్ ఈ సినిమాలో పొలిటిక‌ల్ లీడ‌ర్ గా కనిపించనున్నాడట. గ‌తంలో బన్నీ నటించిన 'రేసు గుర్రం' సినిమా పాలిటిక్స్ బేసేడ్ మూవీ అయినప్పటికీ, అందులో అతను పొలిటిక‌ల్ లీడ‌ర్ గా న‌టించ‌లేదు. అయితే ఇప్పుడు కొరటాల సినిమాలో మొద‌టి సారిగా డైరెక్ట్ పాలిటిక్స్ చేసే నాయకుడిగా బన్నీ నటిస్తున్నాడట. ఈ సినిమా మొత్తం స్టూడెంట్ పాలిటిక్స్ - పేద‌రికం - నిరక్షరాస్యత.. ఇలాంటి అంశాలు చుట్టూనే తిరుగుతుందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే విడుదలైన అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ఈ చిత్రం మంచి కాన్సెప్ట్ తో రాబోతోందని హింట్ ఇచ్చారు. ఇప్పుడు రాజకీయ నాయకుడిగా బన్నీ కనిపించేది నిజమే అయితే ఇలాంటి పాత్రలో ఆయన్ని చూసే ఫ్యాన్స్ కి పండుగే అని చెప్పవచ్చు. ఏదేమైనా ఇందులో అల్లు అర్జున్ మార్క్‌ ఎంటర్టైన్మెంట్ తో పాటు కొరటాల శివ మార్క్‌ మేసేజ్‌ కూడా ఉంటుందని అందరూ గట్టిగా నమ్ముతున్నారు. 'ఆచార్య' సినిమా పూర్తైన తర్వాత కొరటాల ఈ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టనున్నాడు. అదే సమయంలో బన్నీ 'పుష్ప' సినిమా కంప్లీట్ చేయనున్నాడు.