Begin typing your search above and press return to search.
అల్లు అర్జున్.. యశ్ లు అందరికి ఆదర్శం
By: Tupaki Desk | 2 May 2022 5:00 AM ISTబాలీవుడ్ స్టార్ హీరోలు వరుసగా పాన్ మసాలా బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఒక వైపు సౌత్ స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే బాలీవుడ్ హీరోలు మాత్రం పాన్ మసాలా యాడ్స్ లో నటిస్తున్నారు అంటూ ఎద్దేవ చేస్తున్నారు. స్వయంగా ఉత్తరాది సినీ ప్రేక్షకులు మరియు సినీ విశ్లేషకులు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కేవలం డబ్బు కోసం అన్నట్లుగా బాలీవుడ్ హీరోలు పదుల కొద్ది బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. అందులో కొన్ని జనాలకు నష్టం చేకూర్చేవి.. కొన్ని జనాలను మోసం చేసేవి కూడా ఉన్నాయి. అయినా కూడా వారి ప్రయోజనం కోసం అన్నట్లుగా ఆలోచించి కోట్ల పారితోషికం తీసుకుని ఏది పడితే అది.. ఎలా పడితే అలా ప్రమోట్ చేయడం హిందీ స్టార్స్ కు అలవాటు అయ్యింది.
పలు రాష్ట్రాల్లో బ్యాన్ అమలు లో ఉన్న పాన్ మసాలా ను ప్రమోట్ చేయడం ద్వారా కోట్ల పారితోషికం తీసుకుంటున్న స్టార్ హీరోలు మన సౌత్ స్టార్ హీరోలను చూసి మారాల్సిన అవసరం ఉంది. కేజీఎఫ్ 2 తో బాలీవుడ్ స్టార్స్ కంటే ఎక్కువ మాస్ లో ఫాలోయింగ్ ను దక్కించుకున్న యశ్ మరియు పుష్ప తో ఉత్తర భారతంలో ఒక ఊపు ఊపిన అల్లు అర్జున్ లకు బాలీవుడ్ హీరోలను మించిన ఆఫర్లు పాన్ మసాలా నుండి వస్తున్నాయట.
ఆమద్య అల్లు అర్జున్ పాన్ మసాలా యాడ్ ను కాదన్నాడు.. తాజాగా యశ్ కు భారీ డీల్ ను ఆఫర్ చేసినా కూడా నో చెప్పాడట. హీరోలుగా నటించి సంపాదించాలే కాని.. హీరోయిజం ను ఉపయోగించుకుని జనాలను మోసం చేసి.. వారిని తప్పుదారి పట్టించి సంపాదించాలని యశ్ మరియు బన్నీ లు అనుకోలేదు. వీరిద్దరి మాదిరిగా ఇతర హీరోలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
యశ్ మరియు అల్లు అర్జున్ లు ఇద్దరు కూడా ఇప్పుడు సౌత్ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా మంచి గుర్తింపును దక్కించుకున్నారు. అయినా కూడా వారు కక్కుర్తి పడకుండా ఒక సంస్కారంతో వ్యవహరిస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ మరియు యశ్ లు సినిమాలో సిగరెట్ తాగుతూ కనిపించారు.
కాని నిజ జీవితంలో వారు కనీసం సిగరెట్ కూడా కాల్చరు. అందుకే వారు పాన్ మసాలా ఇతర ఆల్కహాల్ మరియు పొగాకు ఉత్పతులను ప్రమోట్ చేసేందుకు నిరాకరిస్తున్నారు. ఈ ఇద్దరు హీరోలను ఎంతగా అభినందించినా తక్కువే అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. వాళ్లకు వీళ్లకు ప్రతి ఒక్కరికి కూడా వీరిద్దరు ఆదర్శం అంటూ కామెంట్స్ వస్తున్నాయి.