Begin typing your search above and press return to search.

బన్నీ వేలంటైన్స్‌ గిఫ్ట్‌

By:  Tupaki Desk   |   7 Jan 2019 2:39 PM IST
బన్నీ వేలంటైన్స్‌ గిఫ్ట్‌
X
ఇండస్ట్ర్లీలో హిట్‌ కోసం ఎదురుచూస్తున్న ఏకైన స్టార్‌ హీరో అల్లు అర్జున్ ఒక్కటే. బన్నీకి తప్ప అందరికి హీరోలకు హిట్స్‌ ఉన్నాయి. లాస్ట్ ఇయర్‌ బన్నీ చేసిన నా పేరు సూర్య ఆశించిన స్థాయిలో హిట్‌ అవ్వలేదు. దీంతో.. ఈసారి తీయబోయే సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టాలనుకుంటున్న అల్లు అర్జున్‌.. దాదాపు ఆరు నెలల నుంచి మంచి కథ కోసం వెయిట్‌ చేస్తూనే ఉన్నాడు. మధ్యలో విక్రమ్‌ కుమార్‌ - పరశురామ్‌ లాంటి పేర్లు విన్పించినా.. ఫైనల్‌ గా త్రివిక్రమ్‌ కే అవకాశం ఇచ్చాడు.

త్రివిక్రమ్‌-బన్నీ కాంబినేషన్‌ లో ఇప్పటివరకు రెండు సినిమాలు వచ్చాయి. ఒకటి జులాయి - రెండు సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి. ఈ రెండు సినిమాలు బాగానా ఆడినా అల్లు అర్జున్‌ కి కావాల్సిన ఇండస్ట్రీ హిట్‌ మాత్రం రాలేదు. దీంతో.. ఈసారి ఇద్దరూ కలిసి ఇండస్ట్రీ హిట్‌ పై కన్నేశారు. ఈ మూవీని ఫిబ్రవరి 14న అంటే వేలంటైన్స్‌‌ డే రోజున లాంచ్‌ చేయబోతున్నారు. ఫిబ్రవరిలో మూవీ స్టార్ట్‌ చేసి దసరా నాటికి రిలీజ్‌ చెయ్యాలనేది ప్లాన్‌. ముచ్చటగా మూడోసారైనా.. వీళ్లిద్దరూ అనుకుంటున్న ఇండస్ట్రీ హిట్‌ సాధిస్తారో లేదో.