Begin typing your search above and press return to search.

బ‌న్ని -స్నేహ బంధానికి 8 ఏళ్లు

By:  Tupaki Desk   |   6 March 2019 8:54 AM GMT
బ‌న్ని -స్నేహ బంధానికి 8 ఏళ్లు
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - స్నేహ రెడ్డి బంధానికి ఎనిమిదేళ్లు. చూస్తుండ‌గానే ఇన్ని సంవ‌త్స‌రాలు గ‌డిచిపోయాయ్. మేం ఇద్ద‌రం.. మాకు ఇద్ద‌రు! అన్న‌ట్టుగా క్యూట్ కిడ్స్ అల్లు అయాన్, అల్లు అర్హ వేగంగా ఎదిగేస్తున్నారు. అల్లు అయాన్, అర్హ తాత - నాయ‌న‌మ్మ‌లను ఓ ఆటాడుకునేంత ఎదిగేశారు. అర్హ అయితే డాడ్ నే ఆడుకుంటోంది. నేను చెప్పిన కుర్రాడినే పెళ్లాడాలి! అని డాడ్ అర్జున్ అడిగేస్తే.. అస్స‌లు పెళ్లాడ‌ను! అంటూ పెద్ద ట్విస్టే ఇచ్చింది క్యూట్ అర్హ‌. పెళ్లికి ముందే అంద‌మైన ప్రేమ‌క‌థ‌.. అటుపై పెద్ద‌ల్ని ఒప్పించి పెళ్లాడిన డేరింగ్ గ‌య్ బ‌న్ని. స్నేహ ఇంట్లో ఒప్పించేందుకు చాలానే చేశాడు. ఇంత‌కంటే మ‌ధుర‌జ్ఞాప‌కం ఇంకేం ఉంటుంది ఏ కుర్రాడి లైఫ్ లో అయినా?

నెమ‌రు వేసుకుంటా ఇంకా ఎన్నో ఎన్నో! మ‌ధుర‌మైన జ్ఞాప‌కాల్ని ఎన్నిటినో మ‌దిలో ప‌దిల‌ప‌రుచుకున్నారు బ‌న్ని- స్నేహ జంట‌. వీలున్న‌ప్పుడ‌ల్లా ఫ్యామిలీ తో దేశ‌, విదేశాల్లో అడ్వెంచ‌ర్ ట్రిప్స్ వెళుతుంటారు బ‌న్ని. వినోదం.. సాహ‌సం! అన్న కాన్సెప్టులో ట్రిప్స్ వెళుతుంటారు. జాలీ టైమ్ ని స్పెండ్ చేస్తుంటారు. అప్పుడ‌ప్పుడు రెస్టారెంట్లు, డిన్న‌ర్ .. బ్రంచ్ సెల‌బ్రేష‌న్స్ .. ఇవ‌న్నీ నిత్య‌ వ్యాప‌క‌మే. అల్లు అయాన్, అర్హ ఇద్ద‌రికి బోలెడంత మంది ఫ్రెండ్స్ కూడా ఆ కాంపౌండ్ లోనే ఉన్నారు.

మొత్తానికి టాలీవుడ్ టాప్ హీరోల్లో అల్లు అర్జున్ హ్యాపీ ఫ్యామిలీ మ్యాన్. స్టార్ హీరోగా స్టాట‌స్‌ని ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీ మ్యాన్ గానూ అంతే సెల‌బ్రేష‌న్ మూడ్ ని ఆస్వాధిస్తున్నాడు. ప్ర‌స్తుతం కెరీర్ పై పూర్తి సీరియ‌స్ గా కాన్ స‌న్‌ట్రేట్ చేస్తున్న బ‌న్ని ఒకేసారి రెండు సినిమాల్ని ప్ర‌క‌టించి పెద్ద ట్విస్టిచ్చాడు. పెళ్లి రోజుకు రెండ్రోజుల ముందే.. అల్లు అర్జున్ 19, అల్లు అర్జున్ 20 చిత్రాల‌కు ద‌ర్శ‌కుల్ని ప్ర‌క‌టించాడు. త్రివిక్ర‌మ్, సుకుమార్ ల‌తో ప్రాజెక్టుల్ని ప్ర‌క‌టించాడు. `నా పేరు సూర్య‌` త‌ర్వాత బ‌న్ని ఎందుక‌ని అంత గ్యాప్ తీసుకున్నాడు? ఎందుకు అంత సైలెంట్ గా ఉన్నాడో అప్పుడు అర్థ‌మైంది అంద‌రికీ. ఉన్న‌ట్టుండి ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చి త‌న ప్రాణ మిత్రుడు సుకుమార్ కి బిగ్ బూస్ట్ నే ఇచ్చాడు బ‌న్ని. ఈ రెండు ప్రాజెక్టుల‌పై ఆడియెన్ లోనూ అంతే అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి అప్పుడే.