Begin typing your search above and press return to search.

స్టైల్ ఐకాన్ పుష్ప‌రాజ్ తో స్నేహ ఫోజ్ అదుర్స్

By:  Tupaki Desk   |   13 Nov 2022 4:18 AM GMT
స్టైల్ ఐకాన్ పుష్ప‌రాజ్ తో స్నేహ ఫోజ్ అదుర్స్
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌తిసారీ త‌న‌దైన విల‌క్ష‌ణ‌త‌తో వెండితెర‌పై అల‌రిస్తున్నారు. సినిమా సినిమాకి వైవిధ్యం అంటే ఏమిటో చూపిస్తూ బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకుంటూ ఎదురే లేని హీరోగా త‌న‌ని తాను ఆవిష్క‌రించుకున్నాడు. పుష్ప చిత్రంతో అత‌డు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. పుష్ప సీక్వెల్ తో మ‌రో లెవ‌ల్ అంటే ఏంటో చూపించ‌బోతున్నాడు. అత్యంత భారీ కాన్వాస్ తో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. ఇంత‌లోనే ఇప్పుడు ద‌క్షిణాఫ్రికాలో అంద‌మైన లొకేష‌న్ లో భార్య స్నేహారెడ్డితో క‌లిసి బ‌న్ని వెకేష‌న్ హాట్ టాపిక్ గా మారింది. ఈ జంట త‌మ స్నేహితుల పెళ్లి కోసం అక్క‌డికి వెళ్లారు. ఇక పెళ్లి నుంచి ఈ అంద‌మైన జోడీ ఫోటోలు వీడియోలు ఇన్ స్టా మాధ్య‌మంగా బంచ్ లుగా రిలీజ‌వుతుంటే అభిమానులు వాటిని వైర‌ల్ చేస్తున్నారు.

బ‌న్ని త‌న భార్యామ‌ణి సహా దక్షిణాఫ్రికాలోని వెస్ట్రన్ కేప్ లోని ఫ్రాన్ షోక్ లో స్నేహితుడి వివాహంలో బోలెడంత సంద‌డి చేస్తుండ‌డం ఈ ఫోటోల్లో క‌నిపిస్తోంది. డెస్టినేషన్ వెడ్డింగ్ కావ‌డంతో ఇక్క‌డ ఆనందానికి సెల‌బ్రేష‌న్స్ కి అవ‌ధుల్లేవ్. స్పాట్ నుండి కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. బన్నీ-స్నేహ ద్వయం ఈ ఫోటోల్లో షో స్టాప‌ర్స్ గా నిలుస్తున్నారు. అల్లు అర్జున్ స్నేహితులు దీప్తి జాస్తి - అధిప్ అయ్యర్ దక్షిణాఫ్రికాలో డెస్టినేషన్ వెడ్డింగ్ లో వివాహం చేసుకున్నారు.

ఈ పెళ్లిలో పుష్ప‌రాజ్ సంద‌డిపై అభిమానులు బోలెడంత ఆరాలు తీస్తున్నారు. అంతేకాదు ఈ పెళ్లిలో కూడా బ‌న్ని గుబురు గ‌డ్డాన్ని తీసేయ‌లేదు. గుబురుగా ఎదిగిన గ‌డ్డంని షేవ్ చేయ‌కుండానే బాగా ఎదిగిన ఫంకీ హెయిర్ తో క‌నిపించాడు. అయినా అత‌డు ఎంపిక చేసుకున్న దుస్తులు త‌న‌ను ఎంతో స్టైలిష్ గా ఆవిష్క‌రించాయి. మొర‌టోడు అయిన పుష్ప‌రాజ్ ని కాకుండా ఈ ఫోటోలు కొత్త బ‌న్నీని ఆవిష్క‌రిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే స్టైలిష్ ఐకాన్ స్టార్ ని ఎలివేట్ చేసాయ‌ని చెప్పాలి. మ‌రోవైపు స్నేహారెడ్డి ఈ పెళ్లి ఆద్యంతం ఒక క‌థానాయిక‌ను మించి అద్భుత ఫోటోషూట్ల‌తో మెరుపులు మెరిపిస్తోంది. హ‌బ్బీతో క‌లిసి స్నేహ ఈ వేడుక‌ను ఎంతో ఎంజాయ్ చేస్తున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. అల్లు అర్జున్ పాస్టెల్ కలర్ స్వెట్ ష‌ర్ట్.. తెల్లటి ప్యాంట్ లో ఎంతో స్టైలిష్ గా క‌నిపించాడు. స్నేహ ఎత్నిక్ వేర్ లో ఆక‌ట్టుకుంది.

పుష్ప‌రాజ్ బ‌రిలో దిగేదెపుడు?

అల్లు అర్జున్ `పుష్ప: ది రైజ్` విడుదలై దాదాపు ఒక సంవత్సరం అయ్యింది. ఇప్పటికీ ఈ మూవీ గురించి చ‌ర్చ సాగుతూనే ఉంది. ఇప్పుడు రెండవ భాగం, పుష్ప: ది రూల్ లో పుష్పరాజ్ ఐకానిక్ రోల్ ఇంకెలా మారుతుందో చూడాల‌న్న ఉత్కంఠ నెల‌కొంది. త‌గ్గేదేలే! అంటూ ఈసారి రేంజును అమాంతం పెంచేందుకు సుకుమార్ టీమ్ చాలా ఎక్కువ స‌మ‌యం తీసుకుని స్క్రిప్టును రీరైట్ చేసింది. అభిమానులు ఊపిరి పీల్చుకునేందుకు ఛాన్స్ లేని గ్రిప్పింగ్ థ్రిల్లింగ్ నేరేష‌న్ తో పార్ట్ 2 ర‌క్తి క‌ట్టిస్తుంద‌ని అంచ‌నాలేర్ప‌డ్డాయి. అయితే జూన్ లో ప్రారంభం కావాల్సిన షూటింగ్ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇటీవల న్యూ ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో అల్లు అర్జున్ త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు ధృవీకరించారు. అలాగే పుష్ప 2 విడుదల ప్రణాళికలను వెల్లడించాడు. దక్షిణాది నుండి వచ్చిన అతిపెద్ద బ్లాక్ బస్టర్ లలో ఒకటిగా పుష్ప‌1 నిలిచింది.

పార్ట్ 2 కోసం బ‌న్నీపై ఇప్ప‌టికే అన్న‌పూర్ణ స్టూడియోస్ లో పై ఫోటోషూట్ జ‌రిగింది. మ‌రోవైపు బ్యాంకాక్- శ్రీ‌లంక అడ‌వుల్లో అరుదైన లొకేష‌న్ల‌ను వెతికార‌ని గుస‌గుస‌లు వినిపించాయి. బ్యాంకాక్ అడ‌వుల్లో పులితో బ‌న్ని భీక‌ర‌మైన ఫైట్ ని చిత్రీక‌రిస్తార‌ని కూడా లీక్ అందింది. ఇది సీజీలో తెర‌కెక్కినా కానీ.. రియ‌లిస్టిక్ గా ఉండేందుకు చాలా ఎక్కువ కేర్ తీసుకోనున్నార‌ని తెలిసింది. మొత్తానికి సీక్వెల్ తో అద‌ర‌గొట్టాల‌న్న‌ది ప్లాన్‌. డిసెంబ‌ర్ 2023లో ఈ మూవీ విడ‌ద‌ల‌య్యేందుకు ఛాన్సుంది.

పుష్ప: ది రైజ్ లో రష్మిక మందన్న క‌థానాయిక‌. పోలీసు అధికారి భన్వర్ సింగ్ షికావత్ కు పుష్పరాజ్ గుణపాఠం చెప్పడంతో మొదటి భాగం ముగిసింది. ఆ తర్వాత రక్తసిక్తమైన చేతులతో రష్మిక శ్రీవల్లిని పెళ్లి చేసుకున్నాడు. రెండవ భాగం పుష్పరాజ్ వ‌ర్సెస్ భన్వర్ సింగ్ మధ్య వార్ నేప‌థ్యంలో ర‌క్తి క‌ట్టించ‌నుంది. ఈ చిత్రం రెండవ భాగంలో పుష్ప‌రాజ్ వ‌ర్సెస్ భ‌న్వ‌ర్ సింగ్ షెకావ‌త్ వార్ ని చూడటానికి అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. పార్ట్ 2లో అది మ‌రో లెవ‌ల్లో ఉంటుంద‌ని అంచ‌నా. జగదీష్ ప్రతాప్ బండారి- రావు రమేష్- అనసూయ భరద్వాజ్- అజయ్ ఘోష్ త‌దిత‌రులు ఇత‌ర‌ ముఖ్య పాత్రల్లో క‌నిపిస్తారు. సినిమాటోగ్రాఫర్ మిరోస్లా కుబా బ్రోజెక్ -, ఎడిటర్లు కార్తీక శ్రీనివాస్ - రూబెన్ ..మ్యూజిక్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ సాంకేతిక బృందంలో భాగం.